News May 4, 2024
సంబేపల్లె: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
సంబేపల్లె మండలంలోని దేవపట్ల ఆవుల వాండ్లపల్లెకు చెందిన షేక్ నౌజియా అనే డిగ్రీ విద్యార్థిని (19) శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఆవులవాండ్లపల్లెకు చెందిన షేక్ మస్తాన్, హజీరా దంపతుల కుమార్తె ఎస్.నౌజియా రాయచోటిలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు తెలిపారు.
Similar News
News November 8, 2024
వల్లూరు: మృత్యువులోనూ వీడని బంధం
చివరి వరకు ఓ జంట అగ్నిసాక్షిగా ఒకరినొకరు తోడుగా ఉంటామని ప్రమాణం చేసుకున్నారు. అలాగే మృత్యువులోనూ ఒకటిగా వెళ్లారు. ఆ ఘటన గురువారం కడపలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కడపకు చెందిన కానిస్టేబుల్ శివశంకర్(40), భార్య శైలజ(37) బైక్‌పై కడపకు వెళ్తుండగా వల్లూరు దగ్గర వారిని ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే భార్య మృతి చెందగా.. అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలో భర్త చనిపోయినట్లు తెలిపారు.
News November 7, 2024
కడప మాజీ ఎంపీ సతీమణి మృతి
పులివెందుల పట్టణంలోని మాజీ ఎంపీ దివంగత డీఎన్ రెడ్డి సతీమణి లక్ష్మీ దేవమ్మ(95) గురువారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. లక్ష్మీదేవమ్మ ఆరునెలలుగా హైదరాబాద్‌లోని తన కుమారుడు రమణారెడ్డి వద్ద ఉంటోంది. ఇటీవల ఆమె అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. లక్ష్మీదేవమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన 1997లో చనిపోయిన విషయం తెలిసిందే.
News November 7, 2024
రైల్వే కోడూరులో దారుణ హత్యకు గురైంది ఇతనే
ఉమ్మడి కడప రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లి చెరువు కట్ట సమీపంలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే మృతుడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వెంకటనారాయణ(40) అని, కొద్ది రోజుల నుంచి రైల్వేకోడూరు మండలం ఉర్లగట్టుపోడులోని వైఎస్సార్ కాలనీలో ఉంటున్నాడని సీఐ తెలిపారు. మృతుడు టైల్స్ వేసేపని చేస్తూ ఉండేవాడు. అయితే హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు.