News April 1, 2025

సంబేపల్లె: ‘పాడి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత’

image

పాడిరైతుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. మంగళవారం నాగిరెడ్డిపల్లెలో పశువుల తాగునీటి తొట్టెలు, సేద్యపు నీటి కుంటల నిర్మాణ పనులకు అధికారులతో కలసి భూమిపూజ చేశారు. వేసవిలో భూగర్భ జలాల పెంపునకు ఫారం పాండ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News December 7, 2025

6వేల మందితో మూడంచెల భద్రత: సీపీ సుధీర్ బాబు

image

TG: గ్లోబల్ సమ్మిట్‌కు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ‘6 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత, వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 2 రోజుల తర్వాత పబ్లిక్‌కు అనుమతి ఉంటుంది. డెలిగేట్స్‌కు పైలట్ వాహనాలను ఏర్పాటు చేశాం. సమ్మిట్ జరిగే రోజుల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి’ అని పేర్కొన్నారు.

News December 7, 2025

BREAKING.. హైకోర్టు సీరియస్.. పెద్దంపేట GP ఎన్నిక నిలిపివేత

image

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్ అభ్యర్థి చింతపట్ల సుహాసిని నామినేషన్‌ను ఓటర్ లిస్టులో పేరు లేదని ఈసీ తిరస్కరించింది. ఆన్‌లైన్ ఓటర్ లిస్టులో పేరు ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పోటీకి అవకాశం ఇవ్వకపోవడంతో హైకోర్టు ఆగ్రహించింది. హైకోర్టు ఆదేశించినా అధికారులు వినకపోవడంతో ఎన్నికను నిలిపివేసింది.

News December 7, 2025

తల్లయిన హీరోయిన్ సోనారిక

image

టాలీవుడ్ హీరోయిన్ సోనారిక తల్లి అయ్యారు. ఈ నెల 5న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఇవాళ ఆమె ఇన్‌స్టాలో వెల్లడించారు. ‘దేవోం కే దేవ్ మహాదేవ్’ సీరియల్‌లో పార్వతీదేవిగా నటించిన ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో జాదూగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. గత ఏడాది వ్యాపారవేత్త వికాస్ పరాశర్‌ను వివాహం చేసుకున్నారు.