News March 13, 2025
సంబేపల్లె: వారాధి హత్య కేసులో వీడిన మిస్టరీ

కాంట్రాక్ట్ పనుల కోసం వారాధిని హత్య చేసినట్లు విచారణలో తేలినట్లు రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్ తెలిపారు. వారాధిని మార్చి 2వ తేదీన సంబేపల్లె మండలం ముద్దినేనివాళ్ళపల్లి సమీపంలోని మల్లూరమ్మ గుడి వద్ద సిమెంట్ వద్ద కాపలా కాస్తుండగా బండరాయితో హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చిన్నికృష్ణ, యోగానంద రెడ్డిలను అరెస్ట్ చేసినట్లు సీఐ చెప్పారు.
Similar News
News March 14, 2025
పార్వతీపురం జిల్లాలో వారి కోసం ‘ఊయల’

పార్వతీపురం మన్యం జిల్లాలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తల్లిదండ్రుల ఆలనకు నోచుకోని పిల్లల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పీడీ కనకదుర్గ తెలిపారు. ఊయల పేరుతో ఏర్పాటు చేసిన కేంద్రాలను గురువారం ప్రారంభించారు. పిల్లలను పెంచలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు వారిని ఊయల కేంద్రంలో అప్పగించాలని సూచించారు.
News March 14, 2025
కామారెడ్డి: హోలీ పండుగ.. ఇక్కడ శనగల ప్రత్యేకత తెలుసా..?

కామారెడ్డి జిల్లా డోంగ్లీ, మద్నూర్ సహా వివిధ మండలాల్లో హోలీ పండుగ సందర్భంగా కాముడి దహనం తర్వాత శనగలు కాల్చుకుని కుటుంబ సమేతంగా తినడం దశాబ్దాలుగా వస్తోన్న ఆనవాయితీ. కాముడి దహనం తర్వాత అగ్గి నిప్పు కణికలను ఇంటికి తీసుకొచ్చి మంట వెలిగించి శనగలు,కొబ్బరి కాల్చి తినడం వల్ల పళ్లు దృఢంగా ఉంటాయని పెద్దలు తెలిపారు.ఇదే అగ్గితో దీపం వెలిగించి ఇళ్లలో ఉంచుతారన్నారు. పొద్దున కాల్చిన బొగ్గుతో పళ్లు తోముతారన్నారు.
News March 14, 2025
సింగరకొండ దేవాలయ స్పెషాలిటీ ఇదే..!

అద్దంకి – సింగరకొండలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో దక్షిణ ముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఇదొక్కటే ఉంది. ఈ దేవాలయం 1960 నుంచి దేవాదాయ శాఖ పరిధిలోకి చేరింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు.