News August 10, 2024

సకాలంలో వైద్యం అందక తల్లీబిడ్డ మృతి

image

సకాలంలో వైద్యం అందక తల్లి, బిడ్డ మృతి చెందిన ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. గూడెం కొత్తవీధి మండలం ఊబ పొలం గ్రామానికి చెందిన వంతల పరిమళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా స్థానికులు చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ గైనకాలజిస్ట్ లేకపోవడంతో వైద్యం కోసం నర్సీపట్నం తరలించారు. నర్సీపట్నం వైద్యులు పరీక్షించి కడుపులో బిడ్డ చనిపోయిందని చెప్పారు. బిడ్డను బయటకు తీయగా తల్లి కూడా మృతి చెందింది.

Similar News

News September 9, 2024

వారికి సందేశాలు పంపి అలెర్ట్ చేయాలి: హోం మంత్రి

image

కోస్తాంధ్రలోను అతి భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ సమాచరం నేపథ్యంలో రాబోయే 72 గంటలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు. ఉత్తరాంధ్రను వానలు ముంచెత్తడంతో విజయవాడ నుంచి ఆమె విశాఖకు బయలుదేరారు. విపత్తుల నిర్వహణ శాఖను అప్రమత్తం చేశారు. వంశధార, నాగావళి, బహుదా పరివాహక ప్రాంతాల ప్రజల మొబైళ్లకు ఎప్పటికప్పుడు అలెర్ట్ సందేశాలు పంపి అప్రమత్తం చేయాలని సూచించారు.

News September 9, 2024

‘తీవ్ర సంక్షోభంలో విశాఖ స్టీల్ ప్లాంట్’

image

తీవ్ర సంక్షోభంలో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు. ద్వారక నగర్ పౌర గ్రంథాలయంలో స్టీల్ ప్లాంట్ పరిస్థితిని వివరించారు. వేతనాలు అందక ప్లాంట్ కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. ప్లాంటును సెయిల్‌లో విలీనం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 9, 2024

ఆ మరణాలు ప్రభుత్వ హత్యలే: అమర్నాథ్

image

విజయవాడ వరదల్లో మరణాలు ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. ప్రచారం కోసం చంద్రబాబు జేసీబీపై తిరగారని విమర్శించారు. వర్షాలకు అనకాపల్లి జిల్లాలో పంట పొలాలు అన్ని మునిగిపోయాయని అన్నారు. ఒక్క అధికారి జిల్లాలో కనిపించడం లేదన్నారు. కోవిడ్ సమయంలో ఐదు కోట్ల మంది ప్రాణాలను జగన్ కాపాడినట్లు పేర్కొన్నారు.