News February 13, 2025
సఖినేటిపల్లి: విరుచుకుపడిన అంబోతు.. వ్యక్తి మృతి

సఖినేటిపల్లి మండలం రామేశ్వరం వేప చెట్టు వద్ద బుధవారం రాత్రి దారుణం జరిగింది. బైకుపై వెళ్తున్న మోరిపోడుకు చెందిన గుబ్బల మురళీకృష్ణ (30)పై ఆంబోతు దాడి చేసింది. ఈ దాడిలో మురళీకృష్ణ గొంతుకి ఆంబోతు కొమ్ము గుచ్చుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సఖినేటిపల్లి పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, మూడు నెలల కుమార్తె ఉన్నారు. మురళీకృష్ణ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Similar News
News March 19, 2025
మమ్మల్ని కూటమి సర్కార్ అవమానిస్తోంది: బొత్స

AP: శాసనమండలిలో వైసీపీ సభ్యుల పట్ల కూటమి ప్రభుత్వం అవమానకరంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. MLA, MLC క్రీడా పోటీల్లో కూడా తమపై వివక్ష చూపారని ఆయన మండిపడ్డారు. ‘నిన్న జరిగిన ఫొటో సెషన్‌లో నాకు కుర్చీ వేయలేదు. ఇతరులకు కేటాయించిన కుర్చీలో కూర్చోమన్నారు. క్రీడా పోటీల సందర్భంగా CM, స్పీకర్ ఫొటోలు మాత్రమే వేశారు. మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఫొటో వేయలేదు’ అని ఫైర్ అయ్యారు.
News March 19, 2025
ఈనెల 26 నుంచి అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు

రాజంపేట మండలం తాళ్లపాక అన్నమయ్య ధ్యాన మందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు 522 వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రామ్ అధికారిని హేమలత తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో నగర సంకీర్తన, సప్తగిరిల సంకీర్తన, గోష్టి గానం, అన్నమాచార్య సంకీర్తనలు, హరికథ, శ్రీరామ పాదుకలు నాటకం ఉంటుందని తెలిపారు.
News March 19, 2025
విశాఖలో కానరాని చలివేంద్రాలు..!

విశాఖనగరంలో ఎండలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావాలంటే ఎక్కడ వడదెబ్బ తగులుతుందని భయపడుతున్నారు. మనిషి నిరసించి పడిపోతే వెంటనే నీరు అవసరం. గతంలో జీవీఎంసీ సహా పలు స్వచ్ఛందసంస్థలు ప్రతివార్డులో చలివేంద్రాల్లో మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేసేవి. ఇప్పుడు ఆరిలోవ నుంచి మద్దిలపాలెం వరకు ఎక్కడ చుసిన ఒక్క చలివేంద్రం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు.