News February 5, 2025

సఖినేటిపల్లి: సూసైడ్ నోట్ రాసి కుటుంబం అదృశ్యం

image

సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం చెందిన శ్రీనివాస్ (40), భార్య గంగాభవాని (35), కుమార్తె దైవజ్ఞ(6), కుమారుడు మాధవ్ గణేష్(4) మిస్సింగ్ మిస్టరీగా మారింది. స్థానికుల వివరాలు.. ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకున్నాం. చాలా ఏళ్ల నుంచి వడ్డీ కట్టాం. ఇక చెల్లించలేం. అప్పుల బాధ భరించలేకపోతున్నాం. భార్య పిల్లలతో చచ్చిపోతామంటూ సూసైడ్ నోటు రాసి కుటుంబం అదృశ్యమైంది. సోమవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 13, 2025

కరీంనగర్: 13 మంది అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ

image

మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీకి 13 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు అధికారులు గురువారం ప్రకటించారు. 12 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు, 1 ఉపాధ్యాయ అభ్యర్థి, మొత్తం 13 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు. 

News February 13, 2025

ఉత్త‌రాంధ్ర టీచర్ MLC బ‌రిలో 10 మంది

image

ఉత్త‌రాంధ్ర టీచర్ MLC స్థానానికి 10మంది పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి హ‌రేంధిర ప్ర‌సాద్ తెలిపారు. 10మంది నామినేషన్ వెయ్యగా.. ఏ ఒక్కరూ ఉపసంహరించుకోలేదన్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న కౌంటింగ్ ఉండనుంది. 12 ఎంసీసీ బృందాలు, 11 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. నేర చరిత్ర లేనివారిని ఏజెంట్లుగా నియ‌మించుకోవాలని సూచించారు.

News February 13, 2025

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు సిద్దిపేట ‘రాణి’

image

జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలకు సిద్దిపేట జిల్లాకు చెందిన క్రీడాకారిణి రాణి ఎంపికైనట్లు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శివకుమార్ తెలిపారు. ఇటీవల జరిగిన సెలక్షన్స్‌లో రాష్ట్ర కబడ్డీ జట్టులో రాణి చోటు దక్కించుకుందని చెప్పారు. ఈ సందర్భంగా ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు హరియాణాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో రాణి పాల్గొంటుందని పేర్కొన్నారు.

error: Content is protected !!