News March 11, 2025

సఖినేటిపల్లి: 26న నరసింహ స్వామి శాంతి కళ్యాణం

image

సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి శాంతి కళ్యాణం ఈ నెల 26వ తేదీ బుధవారం జరుగుతుందని ఆలయ ఈవో సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాల్గొన్న బహుళ ద్వాదశి సందర్భంగా ఉదయం 10 గంటలకు స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహిస్తామన్నారు. కళ్యాణం ముందస్తు టిక్కెట్లను www.aptemples.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా పొందాలన్నారు. ఆలయం కౌంటర్లో కూడా తీసుకోవచ్చన్నారు.

Similar News

News December 13, 2025

అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

image

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్‌లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.

News December 13, 2025

మంత్రి సంధ్యారాణిని కలిసిన మన్యం డీఈవో

image

పార్వతీపురం మన్యం జిల్లా డీఈవో‌గా బాధ్యతలు స్వీకరించిన పి.బ్రహ్మాజీరావు శనివారం మంత్రి సంధ్యారాణిని సాలూరు క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవంతో జిల్లాను విద్యారంగంలో మరింత ప్రగతి సాధించేలా కృషి చేయాలని మంత్రి సంధ్యారాణి సూచించారు. వీరితో పాటు డిప్యూటీ డీఈవో రాజ్ కుమార్ మంత్రిని కలిశారు.

News December 13, 2025

అల్లూరి జిల్లాలో పెరిగిన టమాట ధర..?

image

అల్లూరి జిల్లాలో టమాటా ధరకు రెక్కలు వచ్చాయి. అడ్డతీగల, రాజవొమ్మంగి, కొయ్యూరు, చింతపల్లి మండలాల్లో శనివారం రిటైల్‌గా కిలో రూ. 80 చొప్పున విక్రాయించారని వినియోగదారులు తెలిపారు. గత వారం రూ.60 ఉండగా ప్రస్తుతం రూ. 20 పెరిగిందన్నారు. ఈ ప్రాంతంలో అకాల వర్షాలు వలన టమాటా పంట దెబ్బ తినడంతో రాజమండ్రి, నర్సీపట్నం నుంచి అల్లూరికు తీసుకొచ్చి విక్రయిస్తున్నామని వ్యాపారులు అంటున్నారు.