News March 11, 2025
సఖినేటిపల్లి: 26న నరసింహ స్వామి శాంతి కళ్యాణం

సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి శాంతి కళ్యాణం ఈ నెల 26వ తేదీ బుధవారం జరుగుతుందని ఆలయ ఈవో సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాల్గొన్న బహుళ ద్వాదశి సందర్భంగా ఉదయం 10 గంటలకు స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహిస్తామన్నారు. కళ్యాణం ముందస్తు టిక్కెట్లను www.aptemples.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా పొందాలన్నారు. ఆలయం కౌంటర్లో కూడా తీసుకోవచ్చన్నారు.
Similar News
News February 9, 2026
ఖమ్మం: ఏకంగా జిల్లా జైలుకే ‘కుళ్లిన మటన్ SUPPLY’

ఖమ్మం నగరంలోని మూడు బొమ్మల సెంటర్ వద్దగల ఓ మటన్ షాపుపై మున్సిపల్ అధికారులు మెరుపు దాడి చేశారు. డీప్ ఫ్రిజ్లో నిల్వ ఉంచిన 30 కేజీల కుళ్లిపోయిన, దుర్వాసన వస్తున్న మాంసాన్ని గుర్తించి సీజ్ చేశారు. కాగా, సదరు మటన్ యజమాని జిల్లా జైలుతో పాటు పలు హోటళ్లకు మాంసం సరఫరా చేసే కాంట్రాక్టర్‌గా ఉండటం గమనార్హం. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
News February 9, 2026
ములుగు జిల్లాలో ఈనెల 11న సెలవు: కలెక్టర్

ములుగు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 11న జరిగే పోలింగ్ రోజున స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర టి.ఎస్. ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు కల్పించారు. ఎన్నికల కోసం వినియోగించే ప్రభుత్వ, విద్యాసంస్థల భవనాలకు 10, 11, 13 తేదీల్లో సెలవులు ప్రకటించారు. ఓటర్లు తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News February 9, 2026
అర్ధరాత్రి వింత అనుభవం: సుధా చంద్రన్

నటి, డాన్సర్ సుధా చంద్రన్ పూనకానికి సంబంధించిన <<18761618>>వీడియో<<>> కొద్ది రోజుల క్రితం వైరల్ అయిన నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. గతంలోనూ తనకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయన్నారు. గుజరాత్‌లో ఓ షూటింగ్ సమయంలో తనపై ఓ శక్తి దాడి చేసినట్లు చెప్పారు. అర్ధరాత్రి గదిలో నిద్రపోతుండగా ఛాతీ బరువుగా అనిపించిందని, చేతులు కదలలేదన్నారు. చివరకు భక్తితో దేవుని నామస్మరణ చేయడంతో ఉపశమనం కలిగిందన్నారు.


