News September 9, 2024
సగం జీతం సాయం చేసిన తిరుపతి కలెక్టర్

విజయవాడ వరద బాధితులకు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అండగా నిలిచారు. ఈ మేరకు తన సగం జీతాన్ని విరాళంగా ప్రకటించారు. అలాగే డీఆర్వో రూ.25 వేలు వరద బాధితులకు విరాళంగా ఇచ్చారు. భారీ వర్షాలకు అతలాకుతలమైన విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి జిల్లాలోని పలువురు అధికారులు విరాళాన్ని ప్రకటించారు.
Similar News
News November 28, 2025
చిత్తూరు: ‘జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలి’

అర్హులైన పేదలకు ప్రభుత్వాల సంక్షేమ పథకాలను చేరువచేసి, వారి అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం కృషి చేయాలని ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు సూచించారు. చిత్తూరు కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ అధ్యక్షతన కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీమోహన్, ZP సీఈవో రవికుమార్ ఉన్నారు.
News November 28, 2025
చిత్తూరు: సివిల్స్ ఎగ్జామ్కు ఫ్రీ ట్రైనింగ్

యూపీపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానీబాషా అన్నారు. సివిల్స్ ప్రిలిమనరీ, మెయిన్స్ పరీక్షలకు జిల్లాలో అర్హత ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
News November 28, 2025
BLOల నియామకానికి ప్రతిపాదనలు: కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు బీఎల్వోల నియామకానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు. బీఎల్ఓలందరికీ గుర్తింపు కార్డులు పంపిణీ చేశామన్నారు.


