News November 19, 2024
సచివాలయ ఉద్యోగులకు నంద్యాల కలెక్టర్ కీలక ఆదేశాలు
నంద్యాల జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సచివాలయ ఉద్యోగి తప్పనిసరిగా FRS హాజరు వేయాలని, దాని ఆధారంగానే జీతభత్యాల చెల్లింపు ఉంటుందని స్పష్టం చేశారు. ZP డిప్యూటీ సీఈఓ, ఎంపీడీవోలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
Similar News
News November 24, 2024
నంద్యాల: 143 మంది పోలీస్ సిబ్బంది బదిలీ
నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న 143 మంది పోలిస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన మాట్లాడారు. పోలీసు సిబ్బంది విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత, బదిలీల కౌన్సెలింగ్‌లో సూచనలు చేశారు. జిల్లాలో ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News November 23, 2024

నంద్యాల: ‘టీచర్స్ సమావేశానికి ప్రణాళిక సిద్ధం చేసుకోండి’
డిసెంబర్ 7న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శనివారం నంద్యాల కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ యాక్షన్ ప్లాన్‌పై వారికి దిశా నిర్దేశం చేశారు.