News February 13, 2026
సచ్చిదానంద సరస్వతి స్వామి మృతి పట్ల జగన్ సంతాపం

తుని తపోవనం మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి శివైక్యం చెందడంపై మాజీ సీఎం జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వామివారు జీవితాంతం ధర్మప్రచారం, వేద సంస్కృతి పరిరక్షణకు విశేష కృషి చేశారని కొనియాడారు. తపోవనం మఠాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్ది, భక్తులను సన్మార్గంలో నడిపించారని స్మరించుకున్నారు. వారి మరణం ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటని, భక్తులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Similar News
News March 13, 2026
KNR: ఉమ్మడి జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురి మృతి

ఉమ్మడి KNR జిల్లాలో నిన్న వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు మృతి చెందారు. జమ్మికుంటలోని ఆర్‌వోబీ ఫ్లైఓవర్‌పై నుంచి దూకి <<19365742>>రాం శివరాజ్<<>>(28), ధర్మారం(M) నర్సింహులపల్లికి చెందిన <<19364283>>శంకరయ్య<<>>(73), కోనాయిపల్లి శివారులో <<19367858>>రాజూరి వీరాచారి<<>>(40), జమ్మికుంటకు చెందిన <<19367714>> కర్రయ్య<<>>లు ఉరి వేసుకొని, మంథని మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<19368176>>గోబు తిరుపతి<<>>(30) మృతి చెందారు.
News March 13, 2026
బాపట్ల: టెన్త్ విద్యార్థులకు గమనిక

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థులకు కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని బాపట్ల DEO శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. పరీక్ష కేంద్రాలను తెలుసుకునేందుకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా హాల్‌టికెట్లపై (QR) కోడ్‌ను అందిస్తున్నామన్నారు. మొబైల్‌లో దీన్ని స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్, పాఠశాల చిత్రం కనిపిస్తాయని పేర్కొన్నారు.
News March 13, 2026
మెదక్: రైలు ఎక్కుతుండగా కాలు తెగింది!

కదులుతున్న రైలు దిగే ప్రయత్నంలో మధ్యప్రదేశ్ వాసి తీవ్రంగా గాయపడ్డాడు. రామాయంపేటలోని ఓ కంపెనీలో పనిచేసే బిహారీ లాల్ (50), గురువారం రాత్రి మనోహరాబాద్ స్టేషన్‌లో రైలు ఆగడంతో కిందికి దిగాడు. రైలు కదలడంతో ఎక్కుతుండగా ప్లాట్‌ఫారమ్, రైలు మధ్య ఇరుక్కుపోకి కుడి కాలు తెగింది. గమనించిన స్థానికులు తూప్రాన్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.


