News October 16, 2024
సజావుగా ఇసుక పంపిణీ చేయాలి: కడప కలెక్టర్
ప్రజలకు సజావుగా ఇసుక పంపిణీ చేసి ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్ఠలు తేవాలని కడప జిల్లా కలెక్టర్ శంకర్ లోతేటి అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాలో ఇసుక పంపిణీపై సంబంధిత అధికారులతో, ఇసుక ఏజెన్సీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అందరికీ అందుబాటులో ఇసుకను అందించాలని ప్రభుత్వానికి, జిల్లాకు ప్రతిష్ఠలు తీసుకురావాలని చెప్పారు.
Similar News
News November 6, 2024
కడప జిల్లా కలెక్టర్‌గా శ్రీధర్
కడప జిల్లా కలెక్టర్‌గా చెరుకూరి శ్రీధర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడున్న కలెక్టర్ శివ శంకర్ తెలంగాణ క్యాడర్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో శ్రీధర్ బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. జిల్లా ప్రజాప్రతినిధుల సహకారంతో వైఎస్సార్ జిల్లాను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
News November 6, 2024
రైల్వే కోడూరులో వ్యక్తి దారుణ హత్య
ఉమ్మడి కడప రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లి చెరువు కట్ట సమీపంలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్య జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గుర్తుతెలియని వ్యక్తిని గొంతు కోసి హత్య చేసిన ఘటనను స్థానికులు బుధవారం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు బ్లాక్ షర్ట్ ధరించి గుబురు గడ్డంతో ఉన్నాడు.
News November 6, 2024
పోలీసుల అదుపులో వర్రా రవీంద్రా రెడ్డి..?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనది పులివెందుల కావడంతో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని కడప స్టేషన్‌కు తరలించారు. గతంలో చంద్రబాబు, పవన్, లోకేశ్, అనితపై వర్రా అసభ్యకర పోస్టులు పెట్టారని పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. ఇతను కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడని సమాచారం.