News February 26, 2025
సజావుగా ఎన్నికలు నిర్వహించండి: జిల్లా కలెక్టర్

ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్లో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం తలారిసింగి ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన నాలుగు జోన్లు, రూట్ల అధికారులు, సిబ్బందితో మాట్లాడి, తగు సూచనలు జారీ చేశారు. ప్రిసైడింగ్ అధికారులకు పలు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టి అనుమాన నివృత్తి చేశారు.
Similar News
News February 27, 2025
నిర్మల్: 109 మంది ఓటేశారు..!

నిర్మల్ జిల్లా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ బుధవారం ముగిసింది. ఎన్నికల విధుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం జిల్లాలో మొత్తం 149 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 109 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పోలింగ్ అధికారులు తెలిపారు.
News February 27, 2025
సిద్దిపేట: ‘సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి’

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఈ నెల 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, సైన్స్ సెమినార్, సైన్స్ పుస్తక ప్రదర్శన, సైన్స్ పరికరాలు, సైన్స్ ప్రయోగాలు, సైన్స్ అభ్యసన సామాగ్రి, ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించాలని పేర్కొన్నారు.
News February 27, 2025
NZB: గోదావరిలో మునిగి యువకుడి మృతి

శివరాత్రి రోజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో స్నానం కోసం వెళ్లిన యువకుడు నీట మునిగి మృతి చెందినట్లు బోధన్ రూరల్ సీఐ విజయబాబు తెలిపారు. బోధన్కు చెందిన వర్ధన్, తన మిత్రుడు విగ్నేశ్తో కలిసి బుధవారం రెంజల్ మండలం కందకుర్తి గోదావరి నదిలో స్నానం కోసం వెళ్ళాడు. వర్ధన్ నీటిలో గల్లంతయ్యాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం లభ్యమైనట్లు విజయ్ బాబు తెలిపారు.