News February 26, 2025

సజావుగా ఎన్నికలు నిర్వహించండి: జిల్లా కలెక్టర్

image

ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్‌‌లో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం తలారిసింగి ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన నాలుగు జోన్లు, రూట్ల అధికారులు, సిబ్బందితో మాట్లాడి, తగు సూచనలు జారీ చేశారు. ప్రిసైడింగ్ అధికారులకు పలు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టి అనుమాన నివృత్తి చేశారు.

Similar News

News July 7, 2025

నస్పూర్: జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం

image

హైదరాబాద్‌లో 5 రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి జూనియర్ వుషూ పోటీల్లో నస్పూర్‌కు చెందిన అత్కపురం హాసిని ప్రతిభ కనబరిచి టైలు విభాగంలో బంగారు పథకం సాధించింది. తెలంగాణ SAI ఛైర్మన్ శివసేన రెడ్డి, వైస్ ఛైర్మన్ సోని బాలదేవి చేతులమీదుగా బంగారు పథకాన్ని హాసిని అందుకుంది. క్రీడాకారిణి హాసిని, కోచ్ శివమహేశ్‌ను జిల్లా వుషూ సంఘం ప్రెసిడెంట్ వేముల సతీశ్, జనరల్ సెక్రటరీ రాజనర్సు అభినందించారు.

News July 7, 2025

దండేపల్లి: అత్తారింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

image

అత్తారింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లి మండలం గుడిరేవులో జరిగింది. ఎస్ఐ తహిసోద్దీన్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రూపను భర్త, అత్తమామలు, సమీప బంధువులు వేధింపులకు గురి చేయడంతో ఆమె ఈ నెల 5న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. రూప తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 7, 2025

గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టిన గిల్

image

ఇంగ్లండ్‌పై భారత్ సాధించిన విజయంలో ఎక్కువ క్రెడిట్ గిల్‌కే ఇవ్వాలి. బ్యాటుతోనే కాకుండా.. కెప్టెన్‌గానూ అద్భుతం చేశారు. విదేశాల్లో అతిపిన్న వయసులో టెస్టు మ్యాచ్ గెలిచిన కెప్టెన్‌గా గవాస్కర్(26Y 198D) పేరిట ఉన్న రికార్డును గిల్(25Y 297D) బద్దలు కొట్టారు. బౌలర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, వారికి నచ్చిన ఫీల్డ్ సెట్ చేసి సూపర్ విక్టరీ సాధించారు. కచ్చితంగా డ్రా చేస్తామన్న ఇంగ్లండ్‌‌కు ఓటమి రుచి చూపించారు.