News March 21, 2025
సజావుగా పదో తరగతి పరీక్షలు: కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగుతున్నాయని, పొరపాట్లకు తావులేకుండా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం విజయవాడ సూర్యారావుపేటలోని కర్నాటి రామ్మోహన్రావు మునిసిపల్ ఉన్నతపాఠశాల పరీక్ష కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లను అయన పరిశీలించారు.
Similar News
News December 5, 2025
రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు ట్రామా నెట్వర్క్: MP

ఏలూరు జిల్లా ఆసుపత్రి సహా 14 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రామా కేర్ సెంటర్లు నడుస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రతాప్ జాదవ్ తెలిపినట్లు ఎంపీ పుట్టా మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించేందుకు దేశవ్యాప్తంగా 196 ట్రామా కేర్ సౌకర్యాలు మంజూరు అయ్యాయని అలాగే ఏపీలో రూ.92 కోట్లు ఖర్చుతో 14 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారని ఎంపీ వెల్లడించారు.
News December 5, 2025
TG టెట్ పరీక్షలు వాయిదా పడతాయా?

TG: ఇన్‌సర్వీస్ టీచర్లూ టెట్ పాస్ కావాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పు ఉపాధ్యాయుల్లో గుబులు పుట్టిస్తోంది. జనవరి 3 నుంచి 31 వరకు <<18427476>>టెట్<<>> జరగనుండగా ప్రిపరేషన్‌కు సమయంలేక ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల విధులు, సిలబస్‌ను పూర్తి చేయడం, వీక్లీ టెస్టుల నిర్వహణలో వారు బిజీగా ఉన్నారు. ఎన్నికలు ముగిశాక పరీక్షలకు 15 రోజులే గడువు ఉంటుంది. దీంతో టెట్‌ను వాయిదా వేయాలని ఆయా సంఘాలు కోరుతున్నాయి.
News December 5, 2025
ESIC ఫరీదాబాద్‌లో ఉద్యోగాలు

ఫరీదాబాద్‌లోని <


