News June 7, 2024

సతీష్ రెడ్డికి అరుదైన గౌరవం

image

భారత రక్షణ మంత్రికి మాజీ సాంకేతిక సలహాదారు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ జి. సతీష్ రెడ్డికి ఇస్రో ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక స్పేస్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ జీవితకాల సభ్యత్వంతో సత్కరించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్, అసోసియేట్ డైరెక్టర్ సింగ్ తదితర శాస్త్రవేత్తల బృందం సతీష్ రెడ్డి సేవలను ప్రశంసించారు.

Similar News

News December 7, 2024

పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రుల పర్యవేక్షణ: కలెక్టర్

image

పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల పర్యవేక్షణ అత్యవసరమని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. శనివారం ఆయన నెల్లూరులోని దర్గామిట్ట డీసీఆర్ జెడ్పి ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమిష్టి కృషితోనే పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఏర్పడతాయన్నారు.

News December 7, 2024

గల్లంతయిన వృద్ధురాలు తుమ్మూరు వాసిగా అనుమానం!

image

నాయుడుపేట స్వర్ణముఖి నదిలో గల్లంతైన వృద్ధురాలు తుమ్మూరు వాసి లోడారి రామమ్మ(80)గా పోలీసులు అనుమానిస్తున్నారు. రామమ్మ శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వచ్చి కనిపించడం లేదని వృద్ధురాలు కుమార్తె మహా లక్ష్మమ్మ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామమ్మ ఇక ఎవరికీ భారం కాకూడదని భావించి నదిలో దూకేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 6, 2024

జిల్లా పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: కలెక్టర్

image

జిల్లా పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు.  కలెక్టర్ ఛాంబర్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పర్యాటక, దేవాదాయ, అటవీశాఖ పరిధిలోని దర్శనీయ ప్రదేశాల పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్లో వికీపీడియాలో అప్లోడ్ చేయాలని సూచించారు.