News March 13, 2025
సత్తమ్మ మృతదేహానికి నివాళులర్పించిన సీపీఐ నాయకులు

జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తల్లి సత్తమ్మ(87) గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న పూర్వం చేర్యాల నియోజకవర్గం సీపీఐ నాయకులు మద్దూరు మండలం నర్సాయపల్లిలో స్వగృహంలో సత్తమ్మ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 14, 2025
OFFICIAL: ‘హరిహర వీరమల్లు’ వాయిదా

హోలీ పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఇందులో పవర్ స్టార్‌తో పాటు ఇతర నటులు గుర్రాలపై ఉన్నారు. మార్చి 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. తొలి పార్ట్‌కు ‘sword vs spirit’ ట్యాగ్‌ను ఖరారు చేశారు.
News March 14, 2025
వైసీపీ మహిళా విభాగం కృష్ణాజిల్లా అధ్యక్షురాలిగా భారతి

వైసీపీ మహిళా విభాగం కృష్ణాజిల్లా అధ్యక్షురాలిగా శీలం భారతి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. భారతీ మచిలీపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా వ్యవహరిస్తున్నారు. భారతి నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. తన నియామకానికి కృషి చేసిన మాజీ మంత్రి పేర్ని నానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
News March 14, 2025
నంద్యాల: హత్యాయత్నం కేసులో ఇద్దరికి 7ఏళ్ల జైలు శిక్ష

హత్యాయత్నం కేసులో ఇద్దరికి 7ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.11వేల జరిమానా విధిస్తూ నంద్యాల జిల్లా కోర్టు న్యాయమూర్తి రాధారాణి తీర్పు చెప్పారు. తమ్మరాజుపల్లె గ్రామంలో 2017లో శివమ్మ అనే మహిళపై హత్యాయత్నం జరిగింది. తన అక్రమ సంబంధం తెలిసిందనే కారణంతో కోడలు ప్రియుడితో కలిసి ఈ ఘటనకు పాల్పడింది. అత్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితులకు శిక్ష పడింది.