News February 25, 2026
సత్తా చాటిన ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పరుగు పందెంలో ఎమ్మెల్యే గద్దె ప్రథమ స్థానం సాధించగా, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. వాలీబాల్‌లో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రొఫెషనల్ ప్లేయర్‌లా అదరగొట్టగా.. కబడ్డిలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రత్యర్థులను ఉడుంపట్టుతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Similar News
News April 16, 2026
యుద్ధానికి సిద్ధపడుతున్న ఇరాన్?

US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ఓవైపు పాక్ సన్నాహాలు చేస్తున్న వేళ ఇరాన్‌లో పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. ఏప్రిల్ 21 నుంచి స్కూళ్లకు వర్చువల్ లెర్నింగ్ అమలు చేయనుంది. స్కూళ్లపైనా గతంలో <<19620831>>దాడులు<<>> జరిగిన నేపథ్యంలో మళ్లీ యుద్ధం మొదలైతే పిల్లలకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మిస్సైల్ కేంద్రాల మరమ్మతులను ఇరాన్ ముమ్మరం చేసింది.
News April 16, 2026
గీసుగొండ: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గీసుగొండ మండలం కోనాయిమాకులం రైతు వేదికలో మండల స్థాయి సమావేశం జరిగింది. కలెక్టర్ డా. సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నిర్దేశించిన పది ముఖ్య అంశాలపై అధికారులు, సర్పంచులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
News April 16, 2026
కుప్పం: మళ్లీ నల్లకోటు వేసిన రెడ్డప్ప

చిత్తూరు మాజీ MP, వైసీపీ సీనియర్ నేత రెడ్డప్ప మళ్లీ నల్లకోటు ధరించి కుప్పం కోర్టుకు హాజరయ్యారు. మాజీ CM జగన్ CPRO శ్రీహరిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. YCP లీగల్ సెల్ పొన్నువోలు సుధాకర్ రెడ్డితోపాటు చిత్తూరు మాజీ MP రెడ్డప్ప శ్రీహరి తరపున వాదించేందుకు వచ్చారు. ఖద్దర్ చొక్కాలో కనిపించే రెడ్డప్ప నల్లకోటు ధరించి రావడంతో ఆయనతో వైసీపీ శ్రేణులు సెల్ఫీలు తీసుకున్నాయి.


