News February 4, 2025
సత్తా చాటిన చుండూరు ఎడ్లు

పల్నాడు జిల్లా రెంటచింతలలో జరుగుతున్న బండలాగుడు పోటీలలో చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన ఎడ్లు సత్తా చాటాయి. జూనియర్ విభాగంలో వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శివకృష్ణకు చెందిన ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటాయి. అలాగే రంగారెడ్డి జిల్లాకు చెందిన రోహన్ బాబుకు చెందిన ఎడ్లు ద్వితీయ స్థానంలో నిలిచాయి. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
Similar News
News November 22, 2025
మంచిర్యాల: పసిబిడ్డల ప్రాణాలకు లెక్కలేదా?

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొందరు డాక్టర్లు <<18353100>>బిడ్డల<<>> ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. నిర్లక్ష్యంతో వారి ప్రాణాలు తీసి డబ్బులతో పరిహారం చేసుకుంటున్నారు. శుక్రవారం డాక్టర్ల నిర్లక్ష్యానికి 5 ప్రాణాలు పోయాయి. అయినా వారిలో సీరియస్నెస్ లేదు. ఇన్ని ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టనట్లు వ్యవరిస్తున్నారని.. బిడ్డల ప్రాణాలు తీసి డబ్బులు బిచ్చంగా పడేసి తప్పించుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్
News November 22, 2025
మహిళలు సంఘటితంగా ముందుకు సాగాలి: కలెక్టర్

మహిళలు సంఘటితంగా ముందుకు సాగాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె హాజరై మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలందరికీ రెండు రకాల చీరలను అందిస్తున్నారని, అందరూ సమానత్వమనే భావన కలిగి ఉండేలా మొత్తం ఈ రంగులను ఎంపిక చేసినట్లు తెలిపారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే అనుకుంది సాధించగలుగుతారని అన్నారు.
News November 22, 2025
ఆస్కార్ బరిలో ‘మహావతార్ నరసింహ’

దేశంలో కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ ఆస్కార్ రేసులో నిలిచింది. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి నామినేట్ అయింది. KPop Demon Hunters, Zootopia 2 వంటి చిత్రాలతో పోటీ పడనుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి భారత్లో విపరీతమైన ఆదరణ లభించింది. ప్రజలు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమా రూ.326 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.


