News June 12, 2024

సత్తా చాటిన పుల్లల చెరువు విద్యార్థి

image

ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా విద్యార్థి సత్తా చాటాడు. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో పుల్లల చెరువు మండలం అక్కపాలేనికి చెందిన కొమిరిశెట్టి ప్రభాస్‌ పదో ర్యాంక్ సాధించాడు. ఆయన తండ్రి పెద్ద పోలయ్య గుంటూరు మిర్చియార్డులో చిరు వ్యాపారిగా పని చేస్తూ జీవనం సాగించేవారు. కంప్యూటర్ సైన్స్ రంగంలో రాణించాలన్నదే తన లక్ష్యమని ప్రభాస్ తెలిపాడు. విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు.

Similar News

News March 26, 2025

ప్రకాశం: పాఠశాలల్లో వాటర్ బెల్..!

image

ప్రకాశం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వాటర్ బెల్ కార్యక్రమం నిర్వహిస్తామని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఒంటిపూట బడుల నేపథ్యంలో ఉదయం 10, 11, 12 గంటల సమయాల్లో రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ నిర్వహించాలని టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు.

News March 26, 2025

ప్రకాశం: వైసీపీకి మరో షాక్ తప్పదా..?

image

ప్రకాశం జిల్లాలో YCPకి షాక్ ఇచ్చేందుకు TDP పావులు కదుపుతోంది. మార్కాపురం, త్రిపురాంతకం MPP ఎన్నిక గురువారం జరగనుంది. పుల్లలచెరువులో వైస్ MPP, ఎర్రగొండపాలెంలో కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక సైతం నిర్వహిస్తారు. అన్ని చోట్లా YCPకి పూర్తి మెజార్టీ ఉన్నా ఆయా స్థానాలను దక్కించుకోవడానికి TDP గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కొందరు స్వచ్ఛందంగా టీడీపీ గూటికి చేరగా.. మరికొందరిని కొన్ని హామీలతో తమవైపు తిప్పుకుంటోంది.

News March 26, 2025

జగన్‌ను కలిసిన ఆళ్ల సతీమణి

image

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీ అభ్యర్థి ఆళ్ల ఆంజనేయరెడ్డిని అరెస్ట్ చేసి ఒంగోలు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వైసీపీ అధినేత జగన్‌ను ఆంజనేయరెడ్డి సతీమణి సుబ్బమ్మ కలిశారు. పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆమె జగన్ వద్ద వాపోయారు. పార్టీ అండగా ఉంటుందని జగన్ ఆమెకు భరోసా ఇచ్చారు. మాజీ సీఎంను కలిసిన వారిలో బూచేపల్లి ఫ్యామిలీ, చెవిరెడ్డి ఉన్నారు.

error: Content is protected !!