News January 23, 2025
సత్తుపల్లిలో హెల్త్ అసిస్టెంట్ సూసైడ్

ఆర్థిక ఇబ్బందులు తాళలేక హెల్త్ అసిస్టెంట్ పురుగు మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడని స్థానికులు తెలిపారు. వారి వివరాలు.. సత్తుపల్లి హనుమాన్ నగర్కు చెందిన సత్తెనపల్లి రవికుమార్(45) లంకాసాగర్ పీహెచ్సీలో హెల్త్ ఆసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 28, 2025
తపాల శాఖ ఆధ్వర్యంలో పిలాటికల్ ఎగ్జిబిషన్

ఖమ్మం నగరంలో శుక్రవారం తపాలా శాఖ ఆధ్వర్యంలో పిలాటికల్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ను జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సందర్శించి తపాల శాఖ స్టాంపులను ఆసక్తిగా తిలకించారు. మొత్తం 108 ప్రేముల్లో 3,456 జాతీయ, అంతర్జాతీయ స్టాంపులను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. పిలాటికల్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులకు పరిజ్ఞానం పెరుగుతుందని పేర్కొన్నారు.
News November 28, 2025
కులాలు, మతాల మధ్య రెచ్చగొట్టే చర్యలు ఉపేక్షించబోం: ఖమ్మం సీపీ

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను సీపీ సునీల్ దత్ ఆదేశించారు. కులాలు, మతాల మధ్య ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలు ఉపేక్షించడం జరగదని హెచ్చరించారు. ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
News November 28, 2025
ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై టోల్ ఫ్రీ నెంబర్: కలెక్టర్

ఖమ్మం: ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1077ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ పట్ల ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్లు ముగిసి అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత ప్రలోభాలు పెరిగే అవకాశం ఉందని, క్షేత్రస్థాయిలో బృందాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.


