News January 23, 2025
సత్తుపల్లిలో హెల్త్ అసిస్టెంట్ సూసైడ్

ఆర్థిక ఇబ్బందులు తాళలేక హెల్త్ అసిస్టెంట్ పురుగు మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడని స్థానికులు తెలిపారు. వారి వివరాలు.. సత్తుపల్లి హనుమాన్ నగర్‌కు చెందిన సత్తెనపల్లి రవికుమార్(45) లంకాసాగర్ పీహెచ్‌సీలో హెల్త్ ఆసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 17, 2025
ఖమ్మం: KCRపై అభిమానం అదుర్స్

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కస్నాతండాలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మిర్చి రైతులు వినూత్నంగా మిరప కల్లంలో హ్యాపీ బర్త్ డే కేసీఆర్ అని రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రైతు లక్న్మయ్య తన మిర్చి కల్లాంలో కేక్ కట్ చేసి కేసీఆర్‌కి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
News February 17, 2025
ఖమ్మం: ‘మా చెవుల్లో పూలు పెడుతున్నారు’

పాలకులు ఏదో ఒక సాకు చెబుతూ తమ చెవుల్లో పూలు పెడుతున్నారంటూ ఖమ్మం జిల్లా జర్నలిస్టులు ఎద్దేవా చేశారు. సోమవారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో చెవుల్లో పూలు పెట్టుకుని వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ జరిగే వరకు ఏదో ఒక రూపంలో నిత్యం నిరసనలు తెలుపుతూనే ఉంటామని, ఇందుకు అన్ని జర్నలిస్టు సంఘాలు ముందుకొచ్చేలా కృషి చేస్తామని వారు ప్రతిన బూనారు.
News February 17, 2025
ఖమ్మం: ప్రైవేట్ లెక్చరర్లను ఇబ్బందులు పెడుతున్నారు: ఎంపీ ఈటల

ఉమ్మడి ఖమ్మం- నల్లగొండ- వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రైవేట్ కాలేజీ లెక్చరర్లను ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. ఉద్యోగులకు మేలు చేసేలా బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ఇచ్చిందని ఎంపీ తెలిపారు.