News July 30, 2024
సత్తుపల్లి ఎమ్మెల్యే కుమార్తెలకు సీఎం అభినందనలు

తన చిత్రాన్ని గీసి బహుకరించిన సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ కుమార్తెలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కుమార్తెలు నీలోత్పల, విపంచి, విరాజీలు స్వయంగా గీసిన సీఎం చిత్రాన్ని హైదరాబాదులోని ఆయనకు అందజేశారు. వారి నైపుణ్యానికి మెచ్చిన సీఎం ప్రశంసించారు. వారివెంట మంత్రి పొంగులేటి ఉన్నారు.
Similar News
News December 9, 2025
తొలి విడత ఎన్నికలకు భారీ భద్రత: ఖమ్మం సీపీ

మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ నెల 11న జరిగే ఎన్నిక కోసం 2 వేల మంది సిబ్బందితో పహారా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 953కేసుల్లో 6,403 మందిని బైండోవర్ చేశామన్నారు. రూ.12 లక్షల విలువైన 1,200 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. 16 సరిహద్దు చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు చేపడుతున్నామని కమిషనర్ వివరించారు.
News December 9, 2025
ముదిగొండ: కోతులు, కుక్కల బెడద నివారించేవారికే ఓటు!

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముదిగొండలో యువకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్రామంలో తీవ్రంగా ఉన్న కోతులు, కుక్కల బెడదను నివారించే అభ్యర్థికే తమ ఓటు వేస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సామాజిక సమస్యను పరిష్కరించడానికి ఎవరైతే స్పష్టమైన హామీ ఇస్తారో వారినే గెలిపిస్తామని యువకులు స్పష్టం చేశారు. వారి ఈ నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది.
News December 9, 2025
ఖమ్మం: వెంకటరెడ్డి ప్రస్థానం ఆదర్శనీయం

సర్పంచ్ ఎన్నికల వేళ దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ప్రస్థానం నేటి అభ్యర్థులకు ఆదర్శనీయం. పాత లింగాల సర్పంచ్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన, 1977లో ఏకగ్రీవంగా ఎన్నికై గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. సర్పంచ్‌గా పదేళ్లు పనిచేసి, తర్వాత ఎమ్మెల్యే, మంత్రి స్థాయికి ఎదిగారు. గ్రామాభివృద్ధికి నిబద్ధత ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చని ఆయన నిరూపించారు.


