News February 11, 2025

సత్తుపల్లి: కరెంట్ షాక్‌తో మహిళ మృతి 

image

కరెంట్ షాక్‌తో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన సత్తుపల్లి మండలం కిష్టారంలో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన పానెం సరస్వతి (50) బట్టలు ఉకితి ఆరేస్తోంది. ఈ క్రమంలో ఐరన్ దండానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి షాక్‌కు గురైంది. దీంతో సరస్వతి అక్కడికక్కడే మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి తరలించారు. ఆమె భర్త 2 నెలల క్రితం మృతి చెందగా ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.

Similar News

News December 9, 2025

ఖమ్మం: ఎన్నికల వేళ ఇలా చేస్తున్నారా.. జైలుకే..!

image

ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేళ, పల్లెల్లో డబ్బు, మద్యం పంపిణీ వంటి ప్రలోభాలు జోరందుకున్నాయి. అయితే ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే ఎన్నికల్లో ఇటువంటి చర్యలు నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS)-2023 ప్రకారం, ఎన్నికల వేళ ప్రలోభాలకు పాల్పడినట్లు ఆధారాలతో సహా నిరూపణ అయితే, తీవ్రమైన శిక్షలతో పాటు జరిమానా తప్పదని స్పష్టం చేశారు.

News December 9, 2025

ఖమ్మం: గ్రానైట్ పరిశ్రమల సమస్యలు పరిశీలించిన కలెక్టర్

image

ఖమ్మం ఇండస్ట్రియల్ కాలనీలోని గ్రానైట్ యూనిట్లను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించి పరిశ్రమల పరిస్థితులను పరిశీలించారు. యాజమాన్యం, కార్మికులతో మాట్లాడుతూ.. విద్యుత్ ఛార్జీలు, ఎగుమతులు, మార్కెట్ డిమాండ్ వంటి సమస్యలను తెలుసుకున్నారు. గ్రానైట్ రంగం వేల కుటుంబాలకు ఆధారం కావడంతో త్వరలో పరిశ్రమలతో సమావేశం నిర్వహించి పరిష్కార చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.