News September 3, 2024

సత్తుపల్లి చెరువులోకి దూకిన మహిళ.. కాపాడిన పోలీసులు..

image

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను పోలీసులు కాపాడిన ఘటన సత్తుపల్లిలో జరిగింది. జవహర్ నగర్‌కు చెందిన ఓ మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో సమీపంలోని తామర చెరువులోకి దూకింది. సమాచారం అందుకున్న సత్తుపల్లి పోలీసులు ఆమెను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మహిళను కాపాడిన పోలీసులు ఇజ్జగాని చెన్నారావు, శ్రీనివాస్, ఇమ్రాన్, కరుణాకర్, రమాదేవిలను స్థానికులు అభినందించారు.

Similar News

News December 5, 2025

బెల్టు షాపులపై దాడులు.. రూ.35 వేల మద్యం సీజ్

image

ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు మండలాల్లోని బెల్టు షాపులపై టాస్క్‌ఫోర్స్‌ బృందాలు దాడులు నిర్వహించినట్లు ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. కొణిజర్ల, రఘునాథపాలెం, చింతకాని సహా 7 మండలాల్లో దాడులు నిర్వహించి, సుమారు రూ.35 వేల విలువ గల దాదాపు 600 లీటర్లు ఐఎంఎఫ్‌ఎల్ మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

News December 5, 2025

కూసుమంచిలో అత్యధిక జీపీలు, వార్డులు

image

ఖమ్మం జిల్లాలో అత్యధిక జీపీలు, వార్డులు కూసుమంచి మండలంలో ఉన్నాయి. మండలంలో 41 జీపీలకు గాను 364 వార్డులు ఉన్నాయి. ఆ తర్వాత సింగరేణి మండలంలో 41 జీపీలు, 356 వార్డులు, తిరుమలాయపాలెం మండలంలో 40 జీపీలు 356 వార్డులు ఉన్నాయి. కూసుమంచి మండలంలో మొత్తం 50,357 మంది ఓటర్లకు గాను 24,321 మంది పురుషులు, 26,035 మంది మహిళలు ఇతరులు ఒకరు ఓటరుగా నమోదయ్యాయి.

News December 5, 2025

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో గర్భిణులకు తప్పని ప్రైవేటు బాట

image

ఖమ్మం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రూ.30 లక్షల విలువైన టిఫా స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. దాదాపు ఏడదిన్నరగా రేడియాలజిస్ట్ లేకపోవడంతో ఈ కీలక సేవలు అందడం లేదు. శిశువు ఎదుగుదల తెలుసుకోవాల్సిన గర్భిణులు చేసేది లేక రూ.4,000 వరకు చెల్లించి ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. పూర్తిస్థాయి రేడియాలజిస్ట్‌ను నియమించాలని గర్భిణులు కోరుతున్నారు.