News March 14, 2025
సత్తుపల్లి సబ్ జైలర్, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్?

రిమాండ్ ఖైదీ పరారై పట్టుబడిన కేసులో సత్తుపల్లి సబ్ జైలర్తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈనెల 11వ తేదీన పెండ్ర రమేష్ అనే రిమాండ్ ఖైదీ పరారై అదే రోజు పట్టుబడగా జైళ్లశాఖ వరంగల్ డీఐజీ ఎం.సంపత్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సత్తుపల్లి సబ్ జైలర్ సోమరాజు ప్రవీణ్, కానిస్టేబుళ్లు మారేశ్వరరావు, శ్రీనులను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 4, 2025
జగన్ పర్యటనకు వింత షరతులు: వైసీపీ ఫైర్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణాజిల్లా పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు గాను జగన్ నేడు జిల్లాలోని గూడూరు, మచిలీపట్నం రానున్నారు. అయితే జగన్ పర్యటనలో 500 మంది, 10 కాన్వాయ్లకే పోలీసులు అనుమతి ఇచ్చారు. బైక్లకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై YCP ట్వీట్ చేసింది. జగన్ పర్యటనకు వేలాది మంది వస్తారని తెలిసినా ఈ వింత షరతులు ఏంటని మండిపడింది.
News November 4, 2025
కమలాపురం: హత్య కేసులో నిందితునికి రిమాండ్ విధింపు

కమలాపురం మండలం అప్పారావు పల్లెలో జరిగిన హత్య కేసులో నిందితుడిని సోమవారం పోలీసుల అరెస్టు చేశారు. సీఐ రోషన్ వివరాలు.. ‘చెన్నారెడ్డి, విశ్వనాథ్ రెడ్డిలు అన్నదమ్ములు. విశ్వనాథరెడ్డి మద్యానికి అలవాటుపడి చెన్నారెడ్డి ఆస్తిలో కొంత ఇవ్వాలని తరచూ గొడవ పడేవాడు. ఇందుకు తమ్ముడు ఒప్పుకోకుండా విశ్వనాథ్ రెడ్డిని బలంగా కొట్టడంతో చనిపోయాడు’. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.
News November 4, 2025
వీళ్ల పంచాయితీ కొలిక్కి వచ్చేనా?

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో క్రమశిక్షణ సంఘం ముందు హాజరుకానున్నారు. ఉదయం 11గం కొలికిపూడి, మధ్యాహ్నం 4గంటలకు చిన్నీ హాజరవుతారు. పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అధ్యక్షతన కమిటీ సభ్యులు నేతల వివరణలు తీసుకోనున్నారు. మరి సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం సీఎం చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.


