News March 14, 2025
సత్తుపల్లి సబ్ జైలర్, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్?

రిమాండ్ ఖైదీ పరారై పట్టుబడిన కేసులో సత్తుపల్లి సబ్ జైలర్‌తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈనెల 11వ తేదీన పెండ్ర రమేష్ అనే రిమాండ్ ఖైదీ పరారై అదే రోజు పట్టుబడగా జైళ్లశాఖ వరంగల్ డీఐజీ ఎం.సంపత్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సత్తుపల్లి సబ్ జైలర్ సోమరాజు ప్రవీణ్, కానిస్టేబుళ్లు మారేశ్వరరావు, శ్రీనులను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 25, 2025
కొంతమూరు: ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి

కొంతమూరు హైవే సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల (45) అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నివాసి అయిన పాస్టర్ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో దిగి వ్యక్తిగత పనులు నిమిత్తమై బైక్‌పై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన చనిపోయారు. దీంతో నగరంలో ఉన్న పాస్టర్లు అందరూ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి చేరుకున్నారు.
News March 25, 2025
WGL: మార్కెట్‌లో సరుకుల ధరలు ఇలా..

ఎనుమాముల మార్కెట్‌లో మంగళవారం పలురకాల మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. 5531 మిర్చి క్వింటాకి నిన్న రూ.10,500 ధర పలకగా.. నేడు రూ.10,800 పలికింది. అలాగే టమాటా మిర్చికి నిన్న రూ.26,500 ధర రాగా..నేడు రూ.28వేలు వచ్చింది. సింగిల్ పట్టికి రూ.27వేలు (నిన్న 26వేలు), దీపిక మిర్చి రూ.13,300(నిన్న రూ.22,500) ధర ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. మక్కలు బిల్టి క్వింటాకి నిన్న రూ.2265(నేడు రూ.2250) పలికిందన్నారు.
News March 25, 2025
సీఎం సభ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

హుజూర్ నగర్‌లో ఈనెల 30న జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక అధికారులు సభా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. సభకు తరలివచ్చే ప్రజలకు పార్కింగ్ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు ఉన్నారు.