News June 4, 2024
సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ విక్టరీ
సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించారు. 19 రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఆయన.. అంబటి రాంబాబుపై 25,950 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ మరో రౌండ్ ఓట్ల లెక్కింపు మిగిలి ఉండగా, లెక్కించాల్సిన ఓట్లు మెజారిటీ కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో కన్నా గెలుపు ఖాయమైంది. నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
Similar News
News November 7, 2024
మేరుగు నాగార్జునపై అత్యాచారం కేసులో BIG TWIST
మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై అత్యాచారం కేసు ఊహించని మలుపు తిరిగింది. మేరుగుపై రాజకీయ ఒత్తిడితో తప్పుడు చేసు కేసు పెట్టానని బాధిత మహిళ హైకోర్టులో తెలిపింది. కేసు కొట్టేయాలని బాధిత మహిళ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదు చేసిన వారు కోరిన వెంటనే కేసు కొట్టివేయలేమని, ఫిర్యాదు చేసిన వారు కూడా దీనిపై పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఈనెల 12కి కేసు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
News November 7, 2024
గుంటూరు జిల్లా TODAY TOP NEWS
* CRDA పరిధిలోకి పల్నాడు జిల్లా.. కేబినెట్ ఆమోదం
* అంబటికి హోంమంత్రి అనిత కౌంటర్
* మచిలీపట్నం-రేపల్లె, రేపల్లె-బాపట్ల మధ్య కొత్త రైల్వేలైన్
* నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
* అమరావతిలో బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి
* పట్టభద్రుల ఓటు కోసం 40,105మంది దరఖాస్తు: పల్నాడు కలెక్టర్
* బోరుగడ్డ అనిల్‌కు మరో 14రోజుల రిమాండ్
* మంచి మనసు చాటుకున్న మంత్రి సవిత
News November 6, 2024
డిసెంబర్ 15లోపు అందుబాటులోకి తేవాలి: గుంటూరు కలెక్టర్
గుంటూరు నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. ప్రాంతీయ గ్రంథాలయాన్ని, పాత గుంటూరులోని ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్ భవనాన్ని డిసెంబర్ 15లోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కలెక్టర్ పర్యటనలో పాల్గొన్నారు.