News March 13, 2025
సత్తెనపల్లి: అల్లుడి చేతిలో.. మామ హతం

సత్తెనపల్లి మండలం దీపాలదిన్నెపాలెంలో అల్లుడు చేతిలో మామ హతమయ్యాడు. వివరాల్లోకెళ్తే.. దీపాలదిన్నెపాలెంకు చెందిన గంగయ్య(గంగారమ్) తరచూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో అల్లుడ్ని మందలించేందుకు వచ్చిన మామ, బావమరిదిపై గంగయ్య గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన బత్తుల గంగయ్య(55) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 8, 2026
పిట్లం: కూలి డబ్బుల కోసం హత్య

పిట్లంలో ఈ నెల <<19069742>>6న జరిగిన హత్య<<>> కేసును పోలీసులు ఛేదించారు. బాన్సువాడ DSP విఠల్ రెడ్డి వివరాలు వెల్లడించారు. UPకి చెందిన రాజేశ్, శ్రీకృష్ణ పెయింటింగ్ పనుల కోసం పిట్లం వచ్చారు. కూలీ డబ్బుల విషయంలో వారిద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో రాజేశ్‌ను శ్రీకృష్ణ కర్రతో కొట్టి హత్య చేసి పరారయ్యాడు. నిందితుడు ఊరు విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
News February 8, 2026
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News February 8, 2026
విద్యార్థులకు అస్వస్థత.. కారకులపై CM సీరియస్

AP: పోలవరం(D) దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడానికి గల కారకులపై CM CBN ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటిలోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. బాధ్యులపై శాఖాపరమైన, అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. కాగా నిన్న టిఫిన్ చేశాక 92మంది విద్యార్థులకు కడుపునొప్పి, జ్వరం రావడంతో ఆస్పత్రులకు తరలించామని అధికారులు వివరించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కుదుటపడిందన్నారు.


