News June 21, 2024

సత్తెనపల్లి: పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

image

మండలంలోని అబ్బూరు గ్రామంలో బ్రహ్మయ్య(47) అనే రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్రహ్మయ్య ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి సాగు చేశారు. అయితే పంట సరిగా పండకపోవడంతో సుమారు రూ.20 లక్షలు అప్పులు మిగిలాయి. అప్పులు తీర్చే మార్గం లేక శుక్రవారం పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 1, 2025

గుంటూరు: PGRS సద్వినియోగానికి కలెక్టర్ పిలుపు

image

మీకోసం వెబ్ సైట్‌తో పాటూ నేరుగా PGRS అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో PGRS కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. సమర్పించిన అర్జీల వివరాలను 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. కలెక్టరేట్, అన్ని కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

News November 30, 2025

GNT: దిత్వా తుఫాన్.. కంట్రోల్ రూమ్ నంబర్‌లివే.!

image

గుంటూరు జిల్లాలో దిత్వా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలపై జిల్లా, సబ్‌డివిజన్‌ల వారీగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు.
ఈస్ట్ సబ్‌డివిజన్-0863-2223
వెస్ట్ సబ్‌డివిజన్-0863-2241152 / 0863-225930
నార్త్ సబ్‌డివిజన్-08645-23709
సౌత్ సబ్‌డివిజన్-0863-232013
తెనాలి సబ్‌డివిజన్-08644-22582
తుళ్లూరు సబ్‌డివిజన్-08645-24326
జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 0863-223010.