News June 21, 2024
సత్తెనపల్లి: పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య
మండలంలోని అబ్బూరు గ్రామంలో బ్రహ్మయ్య(47) అనే రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్రహ్మయ్య ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి సాగు చేశారు. అయితే పంట సరిగా పండకపోవడంతో సుమారు రూ.20 లక్షలు అప్పులు మిగిలాయి. అప్పులు తీర్చే మార్గం లేక శుక్రవారం పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 10, 2024
ఇండియా-ఏ జట్టులోకి గుంటూరు కుర్రాడు
గుంటూరు కుర్రాడికి ఇండియా టీంలో చోటు దక్కింది. దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఏ జట్టుకు జురెల్ స్థానంలో షేక్ రషీద్‌ను ఎంపిక చేశారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రషీద్ ఎంపికైన విషయం తెలిసిందే. ఇండియా అండర్-19 జట్టుకూ ప్రాతినిధ్యం వహించాడు. ఈ 19ఏళ్ల గుంటూరు కుర్రాడు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేస్తాడు.
News September 10, 2024
తుళ్లూరు: బాలికను గర్భవతి చేసిన పాస్టర్.. 20 ఏళ్ల జైలు శిక్ష
బాలికను గర్భవతి చేసిన పాస్టర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. తుళ్లూరు మండలం వెంకటపాలెంకి చెందిన కోటేశ్వరరావు (55) చర్చి నిర్వహించేవారు. 2018లో 15ఏళ్ల బాలికపై పాస్టర్ లైంగికదాడికి పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.
News September 10, 2024
రెంటచింతలలో వినాయక లడ్డూ వేలం రూ.7.10 లక్షలు
రెంటచింతల మండల కేంద్రంలోని ఆనంద్ పేటలో ఏర్పాటుచేసిన వినాయక చవితి లడ్డూ వేలం పాట రికార్డ్ స్థాయిలో రూ.7.10 లక్షలు పలికింది. మాజీ ఎంపీపీ గొంటు సుమంత్ రెడ్డి తండ్రి ఆదిరెడ్డి కైవసం చేసుకున్నారు. పోటాపోటీగా జరిగిన వేలంపాటలో తెలుగుదేశం పార్టీ నాయకులు లడ్డూను దక్కించుకున్నారు. నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఊరేగింపుగా లడ్డును ఆదిరెడ్డికి అందజేశారు.