News June 20, 2024
సత్తెనపల్లి: బావిలో యువకుడి మృతదేహం

సత్తెనపల్లి మండల పరిధి కట్టమూరులోని దీపాలదిన్నెపాలెం రహదారి పక్కన ఓ వ్యవసాయ బావిలో దాసరి ఏసుబాబు(22) మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. విషయాన్ని వారు పోలీసులకు తెలిపారు. భట్లూరుకు చెందిన యువకుడు కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో బావిలో పడి చనిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Similar News
News November 14, 2025
జిల్లా ప్రజలకు సురక్షిత నీటిని అందించాలి : కలెక్టర్

గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలో ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు ఓవర్ హెడ్ ట్యాంక్లు నిర్దేశిత సమయంలో శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారుల ఆదేశించారు. జాతీయ రహదారి పై వరద నీటి డ్రైయిన్ల నిర్మాణం, నగరపాలక సంస్థ పరిధిలో వాటర్ ట్యాంక్ ల క్లీనింగ్ పై అధికారులు, కమిటీ సభ్యులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News November 14, 2025
పోలీసులు అలెర్ట్గా ఉండాలి: ఎస్పీ

ఢిల్లీ పేలుళ్లను దృష్టిలో పెట్టుకొని గుంటూరు జిల్లాలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులకు సూచించారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బందితో వకుల్ జిందాల్ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, ఇతర ప్రజాప్రతినిధులు ఉండే సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రతీ రెండు నెలలకోసారి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.
News November 14, 2025
బాల్య వివాహాలపై సమాచారం ఉంటే 1098కి ఫిర్యాదు చేయాలి: కలెక్టర్

బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా సమగ్ర శిశు అభివృద్ధి సేవలు అధ్వర్యంలో జిల్లా స్థాయి బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బాలల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం సర్వేవల్, పార్టిసిపెంట్, డెవలప్మెంట్, ప్రొటెక్షన్ హక్కులను కల్పించిదని అని తెలిపారు.


