News May 26, 2024
సత్తెనపల్లి మీదుగా వెళ్లే రైళ్లు దారి మళ్లింపు

పల్నాడు జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పిన క్రమంలో సత్తెనపల్లి మీదగా వెళ్లే ఫలక్నామా ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రెండు రైళ్లు కాజీపేట, విజయవాడ మీదుగా గమ్య స్థలానికి వెళ్తాయన్నారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు మరమ్మతు పనులు వేగవంతం చేశామని చెప్పారు.
Similar News
News December 4, 2025
GNT: మారువేషంలో మార్చూరీని పరిశీలించిన సూపరింటెండెంట్.!

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ యశస్వి మరోసారి మారువేషంలో ఆసుపత్రిలోని అడ్మినిస్ట్రేషన్ తీరును పరిశీలించారు. ఈసారి ఆయన టీషర్ట్, మడత వేసిన ప్యాంటు, మాస్క్, మంకీ క్యాప్ ధరించి మార్చూరీ బయట సాధారణ వ్యక్తిలా ఒక గంటపాటు కూర్చున్నారు. అక్కడే ఉండి, మృతదేహాల బంధువులతో మాట్లాడి, మార్చూరీలోని పరిస్థితులను అధ్యయనం చేశారు.
News December 4, 2025
దుగ్గిరాలలో క్వింటాల్ పసుపు ధర ఎంతంటే.!

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాల్ పసుపు రూ.12,500 గరిష్ఠ ధర పలికింది. యార్డులో గురువారం నిర్వహించిన వేలంలో పసుపు కొమ్ముల ధర రూ.8,500 నుంచి రూ.12,500 పలకగా కాయ రకం పసుపు ధర రూ. 8,550 నుంచి రూ.12,500 వరకు పలికినట్లు అధికారులు తెలిపారు. రైతులు యార్డుకు తెచ్చిన పసుపు పంటలో 684 బస్తాలను వ్యాపారులకు విక్రయించారు.
News December 4, 2025
నేడు గుంటూరు జిల్లాకు లంకా దినకర్ రాక

20 సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ గురువారం జిల్లాకు రానున్నారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. 4వ తేది ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆరోగ్యం, విద్యా రంగాలకు సంబంధించిన ప్రత్యేక పథకాల అమలు పురోగతి, అమృత్ (AMRUT) అమలు స్థితి, జల్ జీవన్ మిషన్ పురోగతి, PM సూర్యాఘర్, కుసుమ్ పథకాలపై సమీక్షి నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం విజయవాడ బయల్దేరి వెళ్తారన్నారు.


