News April 28, 2024

సత్తెనపల్లి: స్వతంత్ర అభ్యర్థికి నోటీసు

image

నామినేషన్ అఫిడవిట్‌లో పోలీసు కేసుల వివరాలు నమోదు చేయకపోవడంపై స్వతంత్ర అభ్యర్థి బొర్రా వెంకట అప్పారావుకు నోటీసు అందజేసినట్లు ఎన్నికల అధికారి వి.మురళీకృష్ణ తెలిపారు. ఆయన నామినేషన్ అఫిడవిట్‌లో సత్తెనపల్లి పట్టణం, నకరికల్లు పోలీసు స్టేషన్లలో గతేడాది నమోదైన 2కేసుల వివరాలు నమోదు చేయలేదని అన్నారు. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ..లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని RO నోటీసులో పేర్కొన్నారు.

Similar News

News January 3, 2025

పేరలి గ్రామ సర్పంచిపై అనర్హత వేటు

image

కర్లపాలెం(M) పేరలి పంచాయతీ సర్పంచ్‌ మల్లెలవెంకటేశ్వర్లుపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు ప్రిన్సిపల్ గుంటూరు డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు ఆదేశాలిచ్చింది. పేరలి సర్పంచి ఎన్నికల్లో భాగంగా వెంకటేశ్వర్లు నామినేషన్ ఫారంలో తప్పుడు సమాచారాన్ని పొందుపరిచాడని, ఆయన ఎన్నిక చెల్లదని వీరయ్య అనే వ్యక్తి కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. విచారించిన కోర్టు ఆయన ఎన్నిక చెల్లదని, సర్పంచ్ పదవికి అనర్హుడని తీర్పునిచ్చింది.

News January 3, 2025

GNT: డాబాపై నుంచి పడి వ్యక్తి మృతి

image

ప్రమాదవశాత్తు డాబాపై నుంచి వ్యక్తి కిందపడి మృతి చెందిన ఘటనపై కేసు నమోదైంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాగారితోటలో నివాసం ఉండే కొమ్మూరు పకీర్ బుధవారం వీధి కుక్కలు ఇంట్లోకి రావడంతో తరిమే క్రమంలో డాబాపై నుంచి జారిపడ్డాడు. అతణ్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 3, 2025

బోరుగడ్డ అనిల్ బెయిల్ ఫిటిషన్ కొట్టివేత

image

బోరుగడ్డ అనిల్‌ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడమే బోరుగడ్డ పనిగా పెట్టుకున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. అతణ్ని మరికొంతకాలం జైల్లోనే ఉండనీయండని ఆదేశించింది. అలాంటి వారిపై కనికరం చూపించడానికి వీల్లేదంటూ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కాగా సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల కేసులో బోరుగడ్డ అరెస్టైన సంగతి తెలిసిందే.