News August 7, 2024
సత్యదేవుడికి రూ.కోటిన్నర వ్యయంతో వజ్ర కిరీటం

శంఖవరం మండలం అన్నవరం సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మి అమ్మవారు వజ్ర కిరీటధారిణిగా మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దాపురానికి చెందిన మట్టే సత్యప్రసాద్, సూర్యకమల దంపతులు సుమారు రూ.కోటిన్నర వ్యయంతో వజ్రాలు, బంగారు ఆభరణాలతో తయారుచేయించిన కిరీటాన్ని దేవస్థానానికి అందజేశారు. సత్యనారాయణ స్వామి దేవస్థానం 134వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఈ వజ్ర కిరీటాన్ని అలంకరించారు.
Similar News
News November 26, 2025
రాజమండ్రి రూరల్: దేశభక్తిని చాటిన విద్యార్థులు

రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని కలెక్టరేట్లో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, భారత స్వాతంత్ర్య పోరాట స్పూర్తిని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనలు సాగాయి. సంప్రదాయ భారతీయ కళ, సాహిత్య సోయగాలు ప్రతిఫలించిన ఈ కార్యక్రమాలు దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేశాయి.
News November 26, 2025
రాజమండ్రి: మాక్ అసెంబ్లీ విజేతలకు కలెక్టర్ అభినందన

విద్యాశాఖ నిర్వహించిన మాక్ అసెంబ్లీ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బుధవారం కలెక్టర్ కీర్తి చేకూరి జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, వారు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి మాక్ అసెంబ్లీలో 8 మంది విద్యార్థులు, జిల్లా స్థాయిలో 13 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆమె తెలిపారు.
News November 26, 2025
రాజ్యాంగ స్ఫూర్తితో బాధ్యతలు నిర్వర్తించాలి: కలెక్టర్

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాజమండ్రి కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి చేకూరి డా. బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ నిజాయితీ, కర్తవ్య నిబద్ధతతో నిర్వర్తించాలని కోరారు. ప్రతి ఒక్కరూ నీతి, నిజాయితీతో రాజ్యాంగ స్ఫూర్తితో మెలగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.


