News October 21, 2024
సత్యనారాయణ రెడ్డి ఇంటిపై దాడి.. మాజీ మంత్రి కాకాణి ఏమన్నారంటే

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలపై దాడులు పెరిగిపోయాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పెళ్లకూరు మండలంలో జిల్లా వైసీపీ సీనియర్ నాయకులు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఇంటికి తాళాలు వేసి దాడులు చేయడం దారుణమని అన్నారు. సోమవారం సత్యనారాయణ ఇంటి వద్ద ఆయన మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యతో కలిసి సమావేశం నిర్వహించారు. దాడికి పాల్పడిన వాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Similar News
News October 21, 2025
నేడు నెల్లూరు జిల్లాకు వర్ష సూచన

నెల్లూరు జిల్లాలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు సైతం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్స్యకారులు తిరిగి రావాలని సూచించింది. దీపావళి రోజు వర్షం పడటంతో చాలామంది టపాసులు సరిగా పేలలేదు.
News October 20, 2025
కందుకూరు TDPలో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు..

కందుకూరు నియోజకవర్గ టీడీపీలో ‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు ..’ అన్న సామెత ఆదివారం నిజమైంది. రెండు దశాబ్దాల పాటు TDPలో తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పిన మాజీ MLA డా.దివి శివరాంకు ఆదివారం దారకానిపాడులో కూర్చోడానికి కుర్చీ కూడా ఇవ్వలేదు. శివరాం అనుచరుడిగా, ఆయన పైరవీలతో పార్టీ ఇన్‌ఛార్జ్ అయి, ప్రస్తుతం MLAగా ఉన్న ఇంటూరి నాగేశ్వరావు కుర్చీలో కూర్చుంటే వెనుక వరుసలో శివరాం నిలబడాల్సి వచ్చింది.
News October 20, 2025
కందుకూరు మాజీ ఎమ్మెల్యేకు అవమానం!

గుడ్లూరు మండలం దారకానిపాడు హత్య ఘటనను పరామర్శించేందుకు వెళ్లిన కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు ఘోర అవమానం జరిగింది. పాత్రికేయుల సమావేశం సమయంలో ఆయనకు కుర్చీ కూడా ఇవ్వలేదు. సీనియర్ నాయకుడు నిలబడే పరిస్థితి రావడం నేతల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకులు దివి శివరాం పట్ల తగిన గౌరవం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.