News March 2, 2025
సత్యవేడులో కేజీ చికెన్ ధర రూ.90

సత్యవేడు పట్టణంలో కేజీ చికెన్ 90 రూపాయలకు అమ్ముతున్నారు. లైవ్ చికెన్ 70 రూపాయలకే ఇస్తామని నిర్వాహకులు కోళ్ల చిన్న తెలిపారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు చికెన్ కొనడానికి ఎగబడుతున్నారు. బుధవారం కేజీ చికెన్ ధరను 120-100 రూపాయలకు అమ్మారు. వరదయ్యపాలెం మండలంలో కేజీ చికెన్ ధర రూ.180 పలుకుతుంది.
Similar News
News December 24, 2025
నల్గొండ జిల్లాలో వణికిస్తున్న చలి

జిల్లాలో రోజు రోజుకూ పెరుగుతున్న చలి తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటినా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి తోడు చలి గాలులు కూడా వీస్తుండడంతో పల్లె ప్రజలతో పాటు పట్టణ వాసులు ఉదయం పూట బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళలో గ్రామాల్లో ఎక్కడ చూసినా చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు.
News December 24, 2025
NLG: కేటీఆర్ రాక.. బీఆర్ఎస్‌లో నయా జోష్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకతో గులాబీ నేతల్లో నూతన ఉత్సాహం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా గెలిచిన 230 మంది సర్పంచులను సన్మానించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం కార్యకర్తల్లో జోష్ నింపింది. గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి.. రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ చేసిన విధ్వంసాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ చేసిన ప్రసంగంతో నూతన సర్పంచులు, ఆ పార్టీ కార్యకర్తలు కేరింతలు కొట్టారు.
News December 24, 2025
99.21 % పల్స్ పోలియో వ్యాక్సిన్ నమోదు: DMHO

జిల్లావ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 99.21% మంది చిన్నారులకు చుక్కల మందు ఇచ్చినట్లు జిల్లా వైద్యాధికారిని సుజాత తెలిపారు. ఆది, సోమ, మంగళవారాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 0-5 సం.లలోపు చిన్నారులకు తొలిరోజు 2,83,173, 2వ రోజు 4,461, 3వ రోజు 4,628 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు.


