News March 2, 2025

సత్యవేడులో కేజీ చికెన్ ధర రూ.90

image

సత్యవేడు పట్టణంలో కేజీ చికెన్ 90 రూపాయలకు అమ్ముతున్నారు. లైవ్ చికెన్ 70 రూపాయలకే ఇస్తామని నిర్వాహకులు కోళ్ల చిన్న తెలిపారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు చికెన్ కొనడానికి ఎగబడుతున్నారు. బుధవారం కేజీ చికెన్ ధరను 120-100 రూపాయలకు అమ్మారు. వరదయ్యపాలెం మండలంలో కేజీ చికెన్‌ ధర రూ.180 పలుకుతుంది.

Similar News

News March 21, 2025

నెలాఖరులోగా మంజూరును పూర్తి చేయాలి: కలెక్టర్

image

బ్యాంకుల‌కు కేటాయించిన ల‌క్ష్యాల మేర‌కు ఈ నెలాఖ‌రులోగా ప‌థ‌కాల‌ను మంజూరు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ కోరారు. జిల్లా స్థాయి బ్యాంక‌ర్ల స‌మీక్షా క‌మిటీ స‌మావేశం క‌లెక్ట‌రేట్‌లో శుక్ర‌వారం జ‌రిగింది. క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. ప్ర‌తిబ్యాంకుకు ఇచ్చిన ల‌క్ష్యాల మేర‌కు ఈ నెలాఖ‌రులోగా ప‌థ‌కాలు మంజూరు చేసి, గ్రౌండింగ్ అయ్యేలా చూడాల‌ని ఆదేశించారు. విశ్వకర్మపై దృష్టి సారించాలన్నారు.

News March 21, 2025

ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ వెబ్ సిరీస్

image

క్రైమ్ థ్రిల్లర్ ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు నీరజ్ పాండే దర్శకత్వం వహించగా జీత్, ప్రోసెన్‌జీత్ ఛటర్జీ, పరంబ్రత ఛటర్జీ, చిత్రాంగద కీలక పాత్రల్లో నటించారు. 2022లో వచ్చిన ‘ఖాకీ: ది బిహార్ ఛాప్టర్’ వెబ్ సిరీస్ సూపర్ హిట్టవడంతో నెట్‌ఫ్లిక్స్ పార్ట్-2 తెరకెక్కించింది.

News March 21, 2025

విశాఖ అధికారులతో జూమ్ కాన్ఫిరెన్స్

image

విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారులతో రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.సి.డి.సి.డి.సర్వే, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, మాతా, శిశు మరణాల రేటు తగ్గింపు, గర్భిణీల టీ.టీ-1, టీ-టీ-2 డోసులు, జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఆరోగ్య సేవలు మరింత మెరుగుపరచుకోవాలని సూచించారు. DMHO జగదేశ్వరరావు ఉన్నారు.

error: Content is protected !!