News September 6, 2024
సత్యవేడు టీడీపీ ఇన్‌ఛార్జ్ రేసులో SCV నాయుడు

సత్యవేడు టీడీపీ ఇన్‌ఛార్జ్ రేసులో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు గుసగుసలాడుతున్నారు. ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వల్ల పార్టీకి నష్టం జరిగే పరిస్థితి రావడంతో అధిష్ఠానం సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన ట్రబుల్ షూటర్ ఎస్‌సీవీ నాయుడు వైపు అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
Similar News
News November 20, 2025
చిత్తూరు: విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.1.66 కోట్లు మంజూరైంది. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీల కింద ఈ నగదు చెల్లిస్తామని జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. ఏడాదికి రూ.6వేలు చొప్పున మొదటి విడతగా జిల్లాలో 5,553 మందికి 5నెలలకు రూ.1.66 కోట్లు జమ చేశామన్నారు.
News November 19, 2025
బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.