News October 31, 2024

సత్యవేడు: పూడ్చిన మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం

image

తమిళనాడు ఊతుకోటకు చెందిన ధనశేఖర్ కుమారుడు దినేశ్‌ను 2 నెలల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధనశేఖర్ ఊతుకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యవేడు మండలం దాసుకుప్పం పంచాయతీ చెన్నేరి వద్ద మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. సత్యవేడు సీఐ మురళి, ఊతుకోట డీఎస్పీ శాంతి సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి ప్రభుత్వ వైద్యులు, తహశీల్దార్ సుబ్రహ్మణ్యం సమక్షంలో పోస్టుమార్టం చేశారు.

Similar News

News November 7, 2025

స్కూళ్లకు ఈ రెండో శనివారం నో హాలిడే: DEO

image

ఇటీవల తుఫాను ధాటికి చిత్తూరు జిల్లాలో స్కూళ్లకు నాలుగు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా పాఠశాలలు పనిచేయాల్సిన తేదీలను డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 10, ఫిబ్రవరి 14వ తేదీల్లో పాఠశాలలు కచ్చితంగా పనిచేయాలన్నారు. ఏ పాఠశాలకు ఎటువంటి మినహాయింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు.

News November 6, 2025

దూడపై చిరుతపులి దాడి.?

image

ఐరాల మండలం వడ్రంపల్లిలో బుధవారం రాత్రి ఓ అడవి జంతువు దూడపై దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. పాదముద్రల ఆధారంగా చిరుతపులి డాడి చేసినట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కాణిపాకం ఆలయానికి 4 కిలోమీటర్ల సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News November 5, 2025

చిత్తూరు జిల్లా సబ్ జూనియర్స్ బాలుర జట్టు ఇదే..!

image

చిత్తూరు జిల్లా సబ్ జూనియర్స్ బాలుర జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక సదుంలో బుధవారం జరిగింది. ధరణీధర, బాలాజీ, భరత్ కుమార్, మహేంద్ర, సుధీర్(సదుం), వెంకటేశ్, ప్రసన్నకుమార్, ప్రిన్స్ (నిండ్ర), సతీష్(పలమనేరు), హర్షవర్ధన్(ఏఎన్ కుంట), నిఖిల్(దిగువమాఘం), ప్రవీణ్ కుమార్ (చిత్తూరు), సుశీల్ (సిద్ధంపల్లె), గోకుల్(అరగొండ), ప్రవీణ్ కుమార్ నాయక్(పీలేరు) ఎంపికైనట్లు నిర్వాహకులు చెప్పారు.