News January 25, 2025
సత్యసాయి: ‘ఆడబిడ్డలు పుట్టింటికి ప్రాణం.. మెట్టింటికి జీవం’

‘ఆడబిడ్డలు పుట్టింటికి ప్రాణం.. మెట్టింటికి జీవనం’ అని శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఫైరోజ్ బేగం అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ పరిధిలో సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు గౌరవప్రదమైన జీవితం, విద్య, ఉద్యోగ అవకాశాలు పొందడం వారి హక్కు అని తెలిపారు.
Similar News
News December 4, 2025
శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు అలర్ట్

రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ఇటీవల శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు అయ్యాయి. వీటిని రీ షెడ్యూల్ చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ బుధవారం పేర్కొంది. హౌడా-సికింద్రాబాద్(12703), చెన్నై-హౌడా (12840) ఎక్స్ప్రెస్లు డిసెంబర్ 4, 8, 9, 10,11 తేదీల్లో నిర్ణీత సమయం కంటే 2 గంటలు ఆలస్యంగా నడుస్తాయని ఆ శాఖ జీఎం పరమేశ్వర్ తెలిపారు.
News December 4, 2025
కోనసీమ: 11 నెలల్లో 17 మందికి పాజిటివ్

ప్రమాదకరమైన ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి దుర్గారావు దొర సూచించారు. కోనసీమ జిల్లాలో గత 11 నెలల్లో 177 మందిని పరీక్షించగా, 17 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందన్నారు. వారంతా కోలుకున్నారని తెలిపారు. నల్లిని పోలి ఉండే కీటకం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని, లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు.
News December 4, 2025
నష్టపోయేది అమెరికా, యూరప్లే: జైశంకర్

వలస నిబంధనలను కఠినతరం చేస్తే US, యూరప్ తమ సొంత ప్రయోజనాలనే దెబ్బతీసుకునే ప్రమాదం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ‘ప్రతిభను ఉపయోగించుకోవడం పరస్పర ప్రయోజనానికి దోహదపడుతుంది. దీనిపై వారిని ఒప్పించడమే సమస్య. టాలెంట్ కలిగిన వారిని రానివ్వకపోతే నికరంగా నష్టపోయేది వాళ్లే’ అని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా అవకాశాలను స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చని, ప్రభుత్వాలు వారిని అడ్డుకోలేవని చెప్పారు.


