News March 18, 2025
సత్యసాయి: ‘ఆధార్ నమోదులో తప్పులు దొర్లరాదు’

ఆధార్ నమోదులో ఎలాంటి తప్పులు జరగకూడదని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో ఆధార్ నమోదుపై జిల్లా కమిటీతో సమావేశం నిర్వహించారు. ఐదేళ్లలోపు పిల్లలకు వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్, జిఎస్డబ్ల్యూ, పోస్టల్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆధార్ కేంద్రాలలో నమోదు చేయాలని సూచించారు.
Similar News
News October 17, 2025
VJA: IPS సంజయ్ కుమార్ రిమాండ్ పొడిగింపు

ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో నిందితుడిగా ఉన్న IPS అధికారి సంజయ్ కుమార్ రిమాండ్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ నెల 31వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంజయ్ కుమార్ అగ్నిమాపక శాఖ డీజీ, సీఐడీ ఏడీజీగా పనిచేసినప్పుడు రూ.1.5 కోట్ల మేర ప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యాయని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. శుక్రవారం అతడిని తిరిగి విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు.
News October 17, 2025
NGKL: శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలి: ఐజీ చౌహాన్

శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జోగులాంబ జోన్ ఐజీ ఎల్ హెచ్ చౌహాన్ అన్నారు. శుక్రవారం అచ్చంపేట డీఎస్పీ, సీఐ కార్యాలయాలను ఆయన తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులకు అండగా ఉండి న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ నాగరాజు, శంకర్ నాయక్, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు.
News October 17, 2025
‘రేపల్లె నుంచి బాపట్లకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి’

రేపల్లె నుంచి బాపట్లకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని భారత రైల్వే బోర్డు ఛైర్మన్ సతీశ్ కుమార్‌ను బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ కోరారు. గురువారం దిల్లీలో ఆయనను కలిసి రైల్వే పరిధిలో బాపట్లలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను విన్నవించారు. బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్లలో వందే భారత్ రైలుకు స్టాప్ కల్పించాలని రెండు రైల్వే స్టేషన్లో అధునాతన పద్ధతిలో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.