News April 10, 2025
సత్యసాయి జిల్లాకు వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నేడు, రేపు సత్యసాయి జిల్లాలో వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు అనంతపురం జిల్లాలోని రాయదుర్గం డివిజన్‌లో భారీ వర్షం కురిసింది.
Similar News
News February 17, 2026
BREAKING: బాన్సువాడ: కారులో రూ.8 లక్షలు చోరీ

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మాధవరావు అనే రైతు స్థానిక ఎస్బీఐ బ్యాంకు నుంచి మంగళవారం మధ్యాహ్నం రూ.8 లక్షలు డ్రా చేశారు. అనంతరం పట్టణంలోని రిలయన్స్ సూపర్ మార్కెట్‌లో సరకులు తీసుకోవడానికి కారును పార్కు చేశారు. వచ్చేలోపు గుర్తుతెలియని దుండగులు కారు అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న నగదును దోచుకెళ్లారు. ఈ విషయమై బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి సీసీ ఫుటేజీలను పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు.
News February 17, 2026
మానవత్వం చాటుకున్న మంత్రి సత్యకుమార్

రోడ్డు ప్రమాద క్షతగాత్రులను చూసిన వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి మంత్రి సత్యకుమార్ యాదవ్ మానవత్వం చాటుకున్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంగళగిరిలో జరిగే మరో కార్యక్రమానికి వెళ్తుండగా ఎయిమ్స్ సమీపంలో బైకులు ఢీకొని ఓ యువతి, వ్యక్తి గాయపడటాన్ని గమనించారు. మంత్రి వెంటనే తన వాహనం నుంచి దిగి క్షతగాత్రులకు సపర్యలు చేసి పరామర్శించారు. అనంతరం అంబులెన్సులో ఎయిమ్స్‌కి పంపించారు.
News February 17, 2026
పంచాయతీలకు రూ.250 కోట్లు

TG: గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు రూ.250 కోట్లను విడుదల చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించడానికి ఈ నిధులను వినియోగిస్తారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తారు. ఇటీవల 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రూ.387 కోట్లను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.


