News January 30, 2025
సత్యసాయి జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థల బంద్: AISF

అనంతపురం ఓ జూనియర్ కళాశాలలో చరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే కళాశాలపై చర్యలు తీసుకోలేదని AISF నాయకులు అన్నారు. దీనికి నిరసనగా ఈనెల 31న శ్రీ సత్య సాయి జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల బంద్‌కు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శేషం మహేంద్ర, కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. సమస్యను ప్రభుత్వం పరిష్కరించేంతవరకు ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Similar News
News September 16, 2025
పెద్దపల్లి: ‘రాజకీయ లబ్ధికోసం చరిత్రను వక్రీకరించొద్దు’

తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం డిమాండ్ చేశారు. పెద్దపల్లి బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం జరిగిన సభలో పలువురు నాయకులు పాల్గొన్నారు. నిజాం పాలనను ఎదుర్కొన్న కమ్యూనిస్టుల త్యాగాలను బీజేపీ హైజాక్ చేసేందుకు చూస్తోందని ఆరోపించారు.
News September 16, 2025
10 రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు: TTD ఛైర్మన్

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈనెల 23వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ‘28న జరిగే శ్రీవారి గరుడసేవకు 3లక్షలకు పైగా భక్తులు వస్తారు. అందరికీ మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తాం. చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ విధానం అమలు చేస్తాం. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని లోపాలను సరిచేస్తున్నాం’ అని ఆయన చెప్పారు.
News September 16, 2025
భర్త ఉన్నా 10ఏళ్లుగా వితంతు పెన్షన్ తీసుకుంటున్న మహిళ

KNR కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో పిల్లి భారతి అనే మహిళ తన భర్త చనిపోయాడని తప్పుడు సర్టిఫికేట్ చూయించి భూమిని తనపేరిట పట్టా చేయించుకుంది. అంతేగాక పదేళ్లుగా వితంతు పెన్షన్ పొందుతున్నట్లు తెలిసింది. ఆమె భర్త పిల్లి రాజమౌళి.. తాను జీవించి ఉన్నానని, ఆస్తిని తిరిగి తన పేరిట మార్చాలని కలెక్టర్‌ను కోరారు. కాగా, భారతి ఉద్యోగం డిమాండ్ చేస్తూ కలెక్టర్‌తో వాగ్వివాదానికి దిగగా పోలీసులు అదుపు చేశారు.