News April 1, 2025
సత్యసాయి జిల్లాలో చిరుత పులి కలకలం

సత్యసాయి జిల్లాలో చిరుత పులి కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే .. గోరంట్ల మండలం ఎముకలగుట్టపల్లిలో సోమవారం రాత్రి పాడి ఆవుపై చిరుతపులి దాడి చేసింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 17, 2025
రూ.లక్ష కోట్లకు Groww

స్టాక్ బ్రోకింగ్ సంస్థ Groww పేరెంట్ కంపెనీ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్లో అదరగొట్టింది. వరుసగా నాలుగు రోజులు లాభాలు సాధించింది. ఇవాళ షేర్ వాల్యూ మరో 13 శాతం పెరిగి అత్యధికంగా రూ.169.79కి చేరింది. ఇష్యూ ధర రూ.100తో పోలిస్తే దాదాపు 70 శాతం పెరుగుదల నమోదైంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.05 లక్షల కోట్లను తాకింది.
News November 17, 2025
జగిత్యాల: EVMల గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

ధరూర్ క్యాంప్లో ఉన్న ఈవీఎంల గోదామును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సత్యప్రసాద్ సోమవారం తనిఖీ చేశారు. యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక వ్యవస్థలను ఈ సందర్భంగా ఆయన సమగ్రంగా పరిశీలించారు. గోదాములో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం పర్యవేక్షణ కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డీవో మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News November 17, 2025
OFFICIAL: ఎల్లుండి అకౌంట్లలోకి రూ.7,000

AP: ఈ నెల 19న పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ స్కీమ్నూ అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రెండో విడతలో రాష్ట్ర వాటా రూ.5వేలు, కేంద్రం వాటా రూ.2వేలు కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను విడుదల చేస్తారన్నారు. మొత్తంగా 46,62,904 మంది రైతులకు రూ.3,077 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని వివరించారు.


