News April 1, 2025
సత్యసాయి జిల్లాలో చిరుత పులి కలకలం

సత్యసాయి జిల్లాలో చిరుత పులి కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే .. గోరంట్ల మండలం ఎముకలగుట్టపల్లిలో సోమవారం రాత్రి పాడి ఆవుపై చిరుతపులి దాడి చేసింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 18, 2025
భూ భారతి.. కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

TG: ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సమీక్షించి అప్రూవ్ లేదా రిజెక్ట్ చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈనెల 14 నుంచి వచ్చిన కొత్త అప్లికేషన్లను భూ భారతి చట్టం ప్రకారం పరిష్కరించాలని సూచించింది. అప్లికేషన్లను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపింది. దరఖాస్తుదారులు చూపించిన ఆధారాల ప్రకారం సమస్యల పరిష్కారానికి అవకాశం ఇవ్వాలని పేర్కొంది.
News April 18, 2025
ముంబై అదిరిపోయే గేమ్ ప్లాన్.. ఫ్యాన్స్ ఖుషీ

SRHపై నిన్న MI చక్కటి గేమ్ ప్లాన్ అమలు చేసి గెలిచిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పరుగుల వరద పారే వాంఖడేలో బౌలర్లు యార్కర్లు, స్టంప్స్‌ను అటాక్ చేస్తూ, స్లో బాల్స్ వేశారని అంటున్నారు. ఆపై కెప్టెన్ హార్దిక్ బౌలర్లను బాగా రొటేట్ చేశారని, దీంతో SRH తక్కువ స్కోరుకే పరిమితమైందని SMలో పోస్టులు పెడుతున్నారు. చాహర్, హార్దిక్ 40+ రన్స్ ఇవ్వడం మినహా మ్యాచ్‌ను MI వన్ సైడ్ చేసిందని చెబుతున్నారు.
News April 18, 2025
ALERT: నేడు పిడుగులతో వర్షాలు

AP: ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఇవాళ రాష్ట్రంలోని 83 మండలాల్లో వడగాలులు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది.