News March 2, 2025
సత్యసాయి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలపై వినతులు తీసుకుంటామని చెప్పారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరానికి కృషి చేస్తామన్నారు.
Similar News
News February 24, 2026
శ్రీకాకుళం: బంగారం చోరీ చేసిన విద్యార్థులు

శ్రీకాకుళంలోని ఎల్బీఎస్ కాలనీకి చెందిన ఓ ఉద్యోగి ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. నగరంలో ఓ కార్పొరేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంట్లో చొరబడి 2తులాల బంగారం, రూ. 4వేలు ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఆశ్రయించగా వన్ టౌన్ సీఐ పైడాపునాయుడు వారిని పట్టుకున్నారు. విద్యార్థులు మైనర్లు కావడంతో తల్లితండ్రులు అభ్యర్థన మేరకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
News February 24, 2026
కలుపు తీయనివాడు కోత కోయడు

సాగులో ప్రధాన పంటతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. రైతులు సరైన సమయంలో కలుపును తొలగించకపోతే, అది ప్రధాన పంటకు చేరాల్సిన పోషకాలను లాగేసుకొని పంట సరిగా పెరగదు. నిర్లక్ష్యం చేస్తే రైతుకు కోసేందుకు పంట కూడా మిగలదు. అలాగే నిజ జీవితంలో కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఆ దారిలో ఎదురయ్యే ఆటంకాలను (కలుపును) ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని ఈ సామెత తెలియజేస్తుంది.
News February 24, 2026
పూజ ఇలా అస్సలు చేయకూడదు: పండితులు

ఖాళీ నుదుటితో దైవకార్యాలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకూడదని, ఇది అశుభాన్ని ప్రేరేపిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘పూజా సమయంలో నుదుట బొట్టు తప్పనిసరి. విభూతి అయినా ధరించవచ్చు. తిలకధారణ ఏకాగ్రతను పెంచి, సాత్విక శక్తిని ప్రసాదిస్తుంది. లేకపోతే పూజ నిష్ఫలమవుతుంది. పూజలో పాల్గొనేటప్పుడు దైవత్వం కలగాలన్నా, స్వామి అనుగ్రహం పొందాలన్నా నుదుట తిలకధారణ తప్పనిసరి’ అని అంటున్నారు.


