News March 2, 2025

సత్యసాయి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలపై వినతులు తీసుకుంటామని చెప్పారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరానికి కృషి చేస్తామన్నారు.

Similar News

News March 15, 2025

గిర్నిబావి వద్ద కాల్పులు జరగలేదు: వరంగల్ సీపీ

image

కొమ్మాల జాతర సందర్భంగా గిర్నిబావిలో ప్రభ బండ్లు వరుస క్రమంలో తరలి వెళ్లే క్రమంలో కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా సదరు వ్యక్తులు ముందుకు వెళ్లారన్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రభ బండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగిందని, ఎలాంటి పోలీస్ కాల్పులు జరగలేదని వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు.

News March 15, 2025

హిందీని నేనెప్పుడూ వ్యతిరేకించలేదు: పవన్

image

AP: తాను హిందీ భాషను ఎప్పుడూ వ్యతిరేకించలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దాన్ని నిర్బంధంగా అమలు చేయడాన్నే వ్యతిరేకించానని ట్వీట్ చేశారు. NEP-2020 హిందీని కంపల్సరీ చేయాలని చెప్పలేదని, కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఆ పాలసీ ప్రకారం మాతృభాష, మరో భారతీయ భాష, ఒక అంతర్జాతీయ భాష నేర్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. హిందీని చదవడం ఇష్టం లేకపోతే మిగతా భాషలు నేర్చుకోవచ్చన్నారు.

News March 15, 2025

ఎన్నికల కోసమే డీఎంకే హిందీ డ్రామా: కిషన్ రెడ్డి

image

TG: తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతోందని, అందుకే డీఎంకే పార్టీ ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. త్రిభాషా పాలసీ కొత్తదేం కాదని, దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదని స్పష్టం చేశారు. తమిళ భాష అభివృద్ధికి స్టాలిన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌పైనా డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.

error: Content is protected !!