News January 28, 2025
సత్యసాయి జిల్లాలో ఫిర్యాదులకు 67 పిటిషన్లు

శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 67 దరఖాస్తులు వచ్చినట్టు ఎస్పీ కార్యాలయం ప్రకటనలో తెలిపింది. సోమవారం జిల్లా ఎస్పీ రత్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు తమ సమస్యలపై ఫిర్యాదులు చేశారు. వీటిని పరిశీలించిన ఎస్పీ రత్న సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు పంపి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
Similar News
News February 23, 2026
₹130 కోట్ల భారీ రివార్డు ఉన్న క్రిమినల్ హతం!

ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకడు, మెక్సికోలోని అత్యంత శక్తిమంతమైన ‘జాలిస్కో న్యూ జనరేషన్’ (CJNG) డ్రగ్ కార్టెల్ బాస్ ‘ఎల్ మెంచో’ ఆర్మీ ఆపరేషన్‌లో హతమయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున జాలిస్కో రాష్ట్రంలోని తపాల్పాలో జరిగిన మెరుపు దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. మెక్సికో సిటీకి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. అతనిపై US ప్రభుత్వం గతంలో సుమారు ₹130 కోట్ల రివార్డును ప్రకటించింది.
News February 23, 2026
నిర్మల్ జిల్లాకు పతకాల పంట

రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలలో నిర్మల్ జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఆదివారం జరిగిన పోటీల్లో జిల్లాకు మరిన్ని పతకాలు దక్కాయి. రిథమిక్ యోగా అండర్-14 సబ్ జూనియర్ బాలుర విభాగంలో మాగం చరణ్ ప్రతిభ కనబరిచి వెండి పతకం సాధించాడు. అలాగే, అండర్-25 విభాగంలో దిలీప్ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. విజేతలను అధికారులు, క్రీడాభిమానులు అభినందించారు.
News February 23, 2026
KNR: ‘’డిప్యూటీ’ మేయర్‌కి ఛాంబర్ ఉన్నట్టా.. లేనట్టా..?

కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆశలకు గండి పడినట్లు తెలుస్తోంది. ఆదివారం మేయర్ శ్రీనివాస్ తన ఛాంబర్‌లోకి అడుగుపెట్టగా, అదే సమయంలో డిప్యూటీ మేయర్‌కు కూడా ఛాంబర్ కేటాయిస్తారని భావించినా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధికారులు నిర్ణయం తీసుకోలేదు. బీజేపీయేతర పార్టీల నాయకుల ఫిర్యాదు మేరకు ఛాంబర్ అలాట్ నిలిచిపోయింది. ఆయా పార్టీల నాయకులు ఫిర్యాదుతో అధికారులు కూడా వెనుకంజ వేసినట్లు సమాచారం.


