News March 7, 2025
సత్యసాయి జిల్లాలో స్కూళ్లకు సెలవు లేదు.!

శ్రీ సత్య సాయి జిల్లాలో శనివారం పాఠశాలలు కొనసాగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో పాఠశాల పని దినాలు 220 రోజులు నిర్వహించాల్సి ఉందని, వర్షాల వల్ల అదనపు సెలవు దినాలను ప్రకటించిన కారణంగా రేపు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పనిచేస్తాయన్నారు.
Similar News
News October 29, 2025
ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

TG: ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని HYD IMD వెల్లడించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, MHBD, WGL, HNK, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, జనగామ, నాగర్ కర్నూల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని తెలిపింది.
News October 29, 2025
దేశవాళీ వరి.. ఒకసారి నాటితే 3 పంటలు పక్కా

ఒకసారి నాటితే 3 సార్లు కోతకు వచ్చే ‘తులసి బాసో’ దేశవాళీ వరి రకాన్ని సాగు చేస్తున్నారు చిత్తూరు(D) పలమనేరుకు చెందిన చందూల్ కుమార్రెడ్డి. ఇది సువాసన కలిగిన చాలా చిన్న గింజ వరి. మంచి పోషక, ఔషధ గుణాలు కలిగి తినడానికి మధురంగా ఉంటుంది. తొలి పంట 135 రోజులకు, 2వ పంట 60 నుంచి 70 రోజులకు, 3వ పంట 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. ✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News October 29, 2025
సర్వదర్శనానికి 8 గంటల పైనే

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం 8 కంపార్ట్మెంట్ లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. మంగళవారం 64,065 మంది భక్తులు స్వామి వారి దర్శనం చేసుకోగా.. 25,250 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.57 కోట్లు ఆదాయం వచ్చింది.


